Home » అందువల్లే సినిమాలు మానేశా.. సితారను అస్సలు కనాలని అనుకోలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసినా నమ్రత..!!

అందువల్లే సినిమాలు మానేశా.. సితారను అస్సలు కనాలని అనుకోలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసినా నమ్రత..!!

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు భార్య నమ్రత అంటే తెలియని వారు ఉండరు. ఆమె కూడా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్. వంశీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె మహేష్ బాబుతో ప్రేమలో పడి అతనిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా పుల్ స్టాప్ పెట్టింది. అలాంటి నమ్రత తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు పంచుకుంది.. అవేంటో మనం కూడా ఓ లుక్కేద్దాం..

Also Read;డైరెక్టర్ గా మారనున్న కమెడియన్ వేణు.. హీరోయిన్ కూడా మనందరికీ తెలిసిన అమ్మాయే..!!

తనకు ఇప్పటికి కూడా వంట చేయడం రాదని వంట మనిషి ఉంటుందని చెప్పుకొచ్చింది. కేవలం టీ, కాఫీ,మ్యాగీ,ఆమ్లెట్ మాత్రమే చేయగలనని అంతకుమించి వంటలు రావు అని తెలియజేసింది. మహేష్ తో నా వివాహం కావడం చాలా హ్యాపీ మూమెంట్ అని నా జీవితాన్ని మలుపు తిప్పిందని గుర్తుచేసుకుంది. తల్లిగా.. భార్యగా..చక్కగా బాధ్యతలు నిర్వహించడానికి సినిమాలకు దూరంగా ఉన్నానని అన్నది. గౌతమ్ పుట్టిన తర్వాత చాలా కష్టాలు పడ్డామని అసలు గౌతమ్ బతుకుతాడో లేదో అని డాక్టర్లు చెప్పారంటూ తన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి ఉంటాయని గౌతమ్ పుట్టినప్పుడు పడ్డ బాధ చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు సీతారను మేము కనాలని అనుకోలేదని, ఆమె అన్ ఎక్సపెక్టెడ్ బేబీ అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఆమె పుట్టక పోతే మా జీవితం అసంపూర్ణంగానే ఉండేదని ఆనందాన్ని వ్యక్తం చేసింది నమ్రత. బిజినెస్ విషయానికి వస్తే తను సినిమాలు తీయాలనే ఆలోచన లేదని, కానీ మంచి కథలు దొరికితే నిర్మిస్తానని ముక్కు సూటిగా చెప్పింది. మేజర్ సినిమా కథ బాగా నచ్చిందని అందుకే పాన్ ఇండియా లెవెల్ లో తీశానని, చెప్పుకొచ్చింది నమ్రతా శిరోద్కర్.

Also read;Kushboo : ప్రముఖ నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం

Visitors Are Also Reading