Home » డైరెక్టర్ గా మారనున్న కమెడియన్ వేణు.. హీరోయిన్ కూడా మనందరికీ తెలిసిన అమ్మాయే..!!

డైరెక్టర్ గా మారనున్న కమెడియన్ వేణు.. హీరోయిన్ కూడా మనందరికీ తెలిసిన అమ్మాయే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగులో ఎంతో పాపులర్ అయిన బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ ముందు స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ షో ఎంతోమంది కమెడియన్లకు జీవితాన్ని ఇచ్చింది.వారి టాలెంట్ బయట పెట్టడానికి ప్రత్యేక ప్లాట్ ఫామ్ గా మారింది. ఈ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న చాలామంది కమెడియన్లు ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు స్టార్ కమెడియన్ వేణు. అలాంటి వేణు మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడిగా మారబోతున్నారట.. మరి ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం..

Advertisement

ALSO READ;Kushboo : ప్రముఖ నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం

జబర్దస్త్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ “బలగం ” ఈ చిత్రాన్ని బాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో హీరో కూడా ఓ స్టార్ కమెడియనే. ఇప్పటికే హీరోగా అడపాదడపా సినిమాలు చేసిన ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందులో హీరోయిన్ కూడా మనందరికీ బాలనాటిగా పరిచయమైన ఓ అమ్మాయే.. ఆవిడేనండి గంగోత్రి సినిమాలో బేబీ కావ్య ఈమె హీరోయిన్ గా మొదటిసారి పరిచయం అవ్వబోతోంది.

Advertisement

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వేణు మాట్లాడుతూ బలగం అనే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోందని , ఈ సినిమా మొత్తం సిరిసిల్ల గ్రామంలోనే జరుగుతూ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలియజేశాడు. అయినా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల వారికి బాగా నచ్చుతుందని అన్నాడు వేణు. నన్ను నమ్మి డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిన శిరీష్ గారికి దిల్ రాజ్ గారికి కృతజ్ఞతలు అంటూ తెలియజేశాడు. దీంతో వేణు అభిమానులంతా ఆయన డైరెక్టర్ గా సినిమాల్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.

ALSO READ;మంచు మనోజ్-భూమా మౌనిక రెండో పెళ్లి జరిగేది ఆరోజేనా..?

Visitors Are Also Reading