అలనాటి సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన హీరోయిన్ నగ్మా అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. 1990 సంవత్సరం నుంచి 2007 సంవత్సరం వరకు ఇండస్ట్రీని ఏలింది హీరోయిన్ నగ్మా. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అలాగే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసి అందరిని మెప్పించింది ఈ బ్యూటీ నగ్మా.
Advertisement
పెద్దింటి అల్లుడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ… కిల్లర్, ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, కొండవీటి రాజా ఇలా ఎన్నో సినిమాలు చేసింది నటి నగ్మా. అంతేకాదు బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా దూసుకు వెళ్లింది నగ్మా. అదే సమయంలో… టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తో కూడా నటి నగ్మా రిలేషన్ లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకునేందుకు కూడా అక్కడికి వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
Advertisement
గంగూలీని ప్రేమించడం వల్ల..అతన్ని మర్చిపోలేకే… ఇప్పటికే పెళ్లి చేసుకోలేదని చాలాసార్లు వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా తన పెళ్లిపై నగ్మా సంచలన వ్యాఖ్యలు చేసింది. నగ్మా ప్రస్తుత వయసు 48 సంవత్సరాలు. అంటే దాదాపు 50 సంవత్సరాలు అయినట్టే. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న నగ్మా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాకు పెళ్లి చేసుకోకూడదని ఆలోచన లేదని… తనకంటూ ఒక తోడు కావాలని ఉందని చెప్పుకొచ్చింది. అలాగే పెళ్లి చేసుకొని పిల్లలను కనాలని కూడా ఆశగా ఉందంటూ పేర్కొంది. కాలం కలిసి వస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది నగ్మా.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్ లో WWE ఈవెంట్… జాన్ సీనా, రోమన్ రింగ్స్ వస్తున్నారు !
ఖుషి సినిమా చూసి థియేటర్ నుంచి కోపంతో బయటకు వచ్చిన నాగచైతన్య ?
Mannara Chopra : డైరెక్టర్ అత్యుత్సాహం..మీడియా ముందే హీరోయిన్‌కు ము***ద్దు