Home » చనిపోయిన విశ్వనాథ్ పై దారుణమైన కామెంట్స్..పచ్చి బూతులతో ట్రోలింగ్ !

చనిపోయిన విశ్వనాథ్ పై దారుణమైన కామెంట్స్..పచ్చి బూతులతో ట్రోలింగ్ !

by Bunty
Published: Last Updated on
Ad

కళాతపస్వి కే.విశ్వనాథ్ తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో ఒకరు. ఆయన దర్శకుడితో పాటు మంచి నటుడు కూడా. గురువారం ఆయన మరణించిన విషయం తెలిసిందే. కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో అధిక సినిమాలు ఎస్ లెటర్ తో తిరిగిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. విశ్వనాథ్ సినిమాలోని పాత్రలు సైతం ఒకింత కొత్తగా ఉండడంతో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

READ ALSO : మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..బాటిల్ కొనాలంటే ఇక నగదు అవసరం లేదు!

Advertisement

 

ప్రధానంగా కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, శుభోదయం, సాగర సంగమం, సప్తపది, శుభలేఖ, స్వయంకృషి, సిరివెన్నెల, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం వంటి సినిమాలు తెరకెక్కాయి. ఇదిలా ఉండగా, కే.విశ్వనాథ్ మీద సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కే.విశ్వనాథ్ సినిమాల్లో హిందూ భావజాలం, శాస్త్రీయ సంగీతం గొప్పతనం వంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

Advertisement

ఈ కారణంగానే ఆయనపై ఇప్పుడు కొంత మంది విమర్శలకు దిగుతున్నారు అంటే ఆశ్చర్యపోక తప్పదు. జంధ్యం ధరించే కళాతపస్విని ‘కేబుల్ తపస్వి’ అంటూ దుర్భాషలాడుతున్నారు. ఇది నిజంగా శోచనీయం. తన సినిమాల ద్వారా తెలుగు చిత్రసీమను శిఖరాగ్రాన నిలబెట్టిన దర్శక దిగ్గజాన్ని ఇలా విమర్శించడం ఎంతవరకు సబబో వారికే తెలియాలి. శాస్త్రీయ సంగీతంతో పాటు భరతనాట్యం, కూచిపూడి లాంటి లలిత కళలను తన సినిమాల ద్వారా బతికించేందుకు ప్రయత్నించిన విశ్వనాథ్ ను విమర్శించడం సరైనదా కాదా అనేది వారే ఆలోచించుకోవాలి. కాగా, పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే లాంటి జాతీయ పురస్కారాలను గెలుచుకున్న విశ్వనాథ్ ను విమర్శించడం పై ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

read also : Taraka ratna : తారకరత్న ట్రీట్మెంట్ కు లక్షల్లో ఖర్చు…ఎవరు భరిస్తున్నారు తెలిస్తే షాక్ అవుతారు!

Visitors Are Also Reading