Home » రెమ్యూనరేషన్ విషయంలో తగ్గని నాగార్జున..!

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గని నాగార్జున..!

by Azhar
Ad

టాలీవుడ్ సీనియర్ హీరోలలో నాగార్జున ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నాడు అనే చెప్పాలి. వరుస సినిమాలు అంటూ చేస్తూ.. గ్యాప్ లేకుండా గడిపేస్తున్నాడు. ఇప్పుడు ఉన్న యువ హీరోల కంటే నాగార్జునే తొందరగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అదలా ఉంటె ప్రస్తుతం నాగార్జున నుండి వస్తున్న సినిమా ది ఘోస్ట్. ఈ సినిమా వచ్చే నెల 5న దసరా కానుకగా అభిమానుల ముందుకు వస్తుంది. అయితే అదే రోజు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కూడా వస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇదిలా ఉంటె నాగార్జున హీరోగా వస్తున్న ఈ ది ఘోస్ట్ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది అనే విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్ పి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తుంది. అయితే ప్రవీణ్ సత్తారు గతంలో తీసిన సినిమాల వల్ల దీనిపైన మంచి అంచనాలే ఉన్నాయి.

Advertisement

ఇక ప్రస్తుతం నాగార్జున ఈ ది ఘోస్ట్ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ అనేది తెగ వైరల్ గా మారింది. అయితే ఈ ది ఘోస్ట్ సినిమా మొత్తం స్పై థ్రిల్లర్ గా ఉండనుంది. ఇందులో నాగార్జున ఓ కుటుంబాన్ని కాపాడే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం నాగ్ ఏకంగా ఆరు కోట్ల పారితోషకం అనేది అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

హైదరాబాద్ క్రికెటర్ పై నోరుపారేసుకున్న జైస్వాల్.. గ్రౌండ్ నుండి బయటకే..!

వన్డేలో మూడో హ్యాట్రిక్ అందుకుఆ కుల్దీప్ యాదవ్..!

Visitors Are Also Reading