Telugu News » Blog » హైదరాబాద్ క్రికెటర్ పై నోరుపారేసుకున్న జైస్వాల్.. గ్రౌండ్ నుండి బయటకే..!

హైదరాబాద్ క్రికెటర్ పై నోరుపారేసుకున్న జైస్వాల్.. గ్రౌండ్ నుండి బయటకే..!

by Manohar Reddy Mano
Ads
క్రికెట్ గ్రౌండ్ లో ఆటగాళ్లు ఎక్కువ తక్కువ చేస్తే.. వారిని మందలించడం వంటివి చేస్తారు. కానీ ఆ ఆటగాడిని ఏకంగా గ్రౌండ్ నుండే బయటికి పంపించడం వంటివి చాలా అరుదుగా జరుగుతాయి. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న దులీప్ ట్రోఫీలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ టోర్నీలో సౌత్ జోన్, నార్త్ జోన్ మధ్యే టెస్టు మ్యాచ్ లోనే 5వ రోజు ఆట అనేది ఈరోజు సాగింది.
అయితే ఇందులో సౌత్ జోన్ తరపున హైదరాబాద్ కు చెందిన రవితేజ అనే బ్యాటర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. నార్త్ జోన్ యొక్క యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ స్లెడ్జింగ్ అనేది చేయడం ప్రారంభించాడు. ప్రతిసారి అతని ఏకాగ్రతను దెబ్బతీయాలని ప్రయత్నించాడు. అయితే ఈ విషయాని రవితేజ.. నార్త్ జోన్ కెప్టెన్ అయిన అజింక్య రహానేకు రెండుసార్లు తెలిపాడు.
రహానే కూడా యశస్వి జైస్వాల్ ను రెండుసార్లు మందలించాడు. అయిన కూడా యశస్వి జైస్వాల్ తన ప్రవర్తన అనేది మార్చుకోలేదు. మరోసారి రవితేజ విషయంలో అదే పని చేయడంతో అతను ఈసారి అంపైర్లకు ఫిర్యాదు చేసాడు. ఇక అంపైర్లు కూడా కెప్టెన్ రహానేను పిలిచి.. ఈ విషయం చర్చించారు. ఆ ఆతర్వాత రహానే యశస్వి జైస్వాల్ ను మందలించడం పక్కకు పెట్టి.. అతని ఏకంగా గ్రౌండ్ నుండి బయటికే పంపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

You may also like