Telugu News » జ‌గ‌న్ కు చిరంజీవి అంటే ఇష్టం….నేనే వెళ్ల‌మ‌న్నా..నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

జ‌గ‌న్ కు చిరంజీవి అంటే ఇష్టం….నేనే వెళ్ల‌మ‌న్నా..నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

by AJAY MADDIBOINA

మెగాస్టార్ చిరంజీవి నేడు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. సినిమా టికెట్ల‌ అంశంపై ఇండ‌స్ట్రీల‌కు చెందిన ఇత‌ర‌ అంశాలపై ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. అయితే ఈ విషయంపై తాజాగా నాగార్జున స్పందించారు. మా అందరి కోసమే చిరంజీవి సీఎం జగన్ తో సమావేశం అయ్యారని తెలిపారు. సినిమా విడుదల ఉండటం వల్ల వెళ్లలేకపోయాను అని నాగార్జున వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం అంటూ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

nagarjuna ap tickets issue

చిరంజీవి వెళ్తున్నారు…. నేను వెళ్ళమని సలహా ఇచ్చారని నాగార్జున తెలిపారు. ఇండస్ట్రీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని నాగార్జున‌ ధీమా వ్యక్తం చేశారు. ఇక టికెట్ ధరల‌ పై స్పందించింది కేవలం త‌న సినిమా వరకు మాత్రమే అని నాగార్జున తెలిపారు. ఇది ఇలా ఉంటే నాగార్జున బంగార్రాజు ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమా టికెట్ ధరల అంశం తమ సినిమా పై ఎలాంటి ప్రభావం చూపదని… తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. తమ బడ్జెట్ కు ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌లు సరిపోతాయని అన్నారు.

ఒకవేళ ధ‌ర‌లు పెంచితే మేలు జరుగుతుందని నాగార్జున వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సినిమా ఈవెంట్ల‌లో రాజకీయాలు మాట్లాడకూడదని నాగార్జున వ్యాఖ్యానించారు. అయితే నాగార్జున చేసిన వ్యాఖ్య‌లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సినిమా వాళ్లంతా టికెట్ల ధరలు పెంచాలని కోరుకుతుంటే నాగార్జున మాత్రం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని మాట్లాడటం సరికాదని ఆరోపణలు వచ్చాయి. ఈ నేప‌థ్యంలో నాగార్జున త‌న కామెంట్ల‌పై క్లారిటీ ఇచ్చారు.

Also read : మల్టీప్లెక్స్ తో పాటూ మరో బిజినెస్ లోకి అల్లు అర్జున్…బ్రాండ్ పేరు ఏంటంటే..?

You may also like