Telugu News » మల్టీప్లెక్స్ తో పాటూ మరో బిజినెస్ లోకి అల్లు అర్జున్…బ్రాండ్ పేరు ఏంటంటే..?

మల్టీప్లెక్స్ తో పాటూ మరో బిజినెస్ లోకి అల్లు అర్జున్…బ్రాండ్ పేరు ఏంటంటే..?

by AJAY MADDIBOINA

సినిమా హీరోలు వ్యాపారాలు చేయడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలామంది స్టార్ హీరోలు సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటారు. అలా వ్యాపార రంగంలో రాణిస్తున్న వాళ్ళలో మహేష్ బాబు, రామ్ చరణ్, రానా, విజయ్ దేవరకొండ ఉన్నారు. ఇక ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వ్యాపారంలో రాణించేందుకు సిద్ధమవుతున్నారు. అల్లుఅర్జున్ ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ మల్టీప్లెక్స్ కడుతున్నారు.

Ads

ఈ థియేటర్ లో అల్లు అర్జున్ కూడా పార్ట్నర్ గా ఉన్నారు. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ మరో బిజినెస్ తో అతి త్వరలో ముందుకు రాబోతున్నారు. అల్లు అర్జున్ ఇప్పటికే తన పేరులోని రెండు అక్షరాలు AA తో బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తన ఆఫీస్ లో, తన క్యారివ్యాన్ అదే విధంగా తన సినిమా ఫంక్షన్లలో ఈ బ్రాండ్ సింబల్ కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు అల్లు అర్జున్ AA సింబల్ తో ఉన్న బట్టలు కూడా వేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు అదే బ్రాండ్ పేరుతో అల్లు అర్జున్ బట్టల బిజినెస్ లోకి అడుగుపెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పేరుతో దుస్తులు మార్కెట్ లోకి రావాల్సి ఉందట. కానీ కరోనా కారణంగా ఆలస్యం అయినట్టు సమాచారం. ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ రౌడీ వేర్ తో దుస్తుల బిజినెస్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బన్నీ కూడా రాబోతున్నారు మరి బన్నీ దుస్తుల బిజినెస్ ఎలా ఉంటుందో చూడాలి.


You may also like