Home » ప్ర‌భాస్ ను ఫాలో అవుతున్న నాగ్..బిగ్ బాస్ వేధిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

ప్ర‌భాస్ ను ఫాలో అవుతున్న నాగ్..బిగ్ బాస్ వేధిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

by AJAY
Ad

ఆదివారం బిగ్ బాస్ షోకు అతిథిగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ హాజరయ్యారు. జోగిని పల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవ చేస్తూనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను తీసుకువ‌చ్చి కోట్ల మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులతో మొక్కలు నాటించిన‌ ఎంపీ సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఉద్యమంలా జనాల్లోకి తీసుకువెళ్లారు. ఇక ఆదివారం బిగ్ బాస్ షో లోకి వచ్చిన సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్ గురించి వివరించారు. వస్తూనే ఆయన తన వెంట ఒక మొక్క‌ను తీసుకువచ్చి దానిని బిగ్ బాస్ హౌస్ లో నాటాలని కోరారు.

NAGARJUNA

NAGARJUNA

ఇక సంతోష్ కుమార్ మాట్లాడుతూ… పచ్చదనమే రేపటి ప్రగతి పథం అని వ్యాఖ్యానించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తి అయిందని సంతోష్ కుమార్ అన్నారు. గడిచిన మూడేళ్లలో 16 కోట్ల మొక్కలు నాటామ‌ని ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు. ఈ చాలెంజ్ లో సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి అడవులను దత్తత తీసుకున్నార‌ని తెలిపారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 1654 ఎక‌రాలు దత్తత తీసుకొని మొక్క‌లు నాటుతున్నార‌ని తెలిపారు. దాంతో బిగ్ బాస్ వేదికగా హోస్ట్ నాగార్జున‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Advertisement

తాను కూడా వెయ్యి ఎకరాల్లో మొక్కలు పెంచడానికి రెడీ అని చెప్పారు. ఎంపీ సంతోష్ కుమార్ ఎక్క‌డ‌ చూపిస్తే అక్కడ వెయ్యి ఎకరాలు దత్తత తీసుకొని మొక్కలు పెంచడానికి సిద్ధమని చెప్పారు. ఈ యేడాది ఇంకా మూడు వారాలు మిగిలి ఉన్నాయ‌ని… ప్రజలు కూడా మూడు వారాలు మూడు మొక్కలు నాటి ఈ ఏడాది మంచి ముగింపు పలకాల‌ని పిలుపునిచ్చారు. ఇంకా సమయం ఉందని ఇప్పటివరకు ఎన్నో చూస్తూ వ‌చ్చామ‌ని…. కానీ మూడు వారాలు వారానికి ఒకటి చొప్పున మూడు మొక్కలు నాటి 2021కి ముగింపు ప‌ల‌కాల‌ని నాగార్జున కంటెస్టెంట్ల‌ను, ప్రేక్షకులను కోరారు.

ALSO READ : PUSHPA : “ఊ అంటావా” సాంగ్ స్పెషల్ ప్రోమో విడుదల…రెచ్చి పోయిన సమంత…!

Visitors Are Also Reading