Home » PUSHPA : “ఊ అంటావా” సాంగ్ స్పెషల్ ప్రోమో విడుదల…రెచ్చి పోయిన సమంత…!

PUSHPA : “ఊ అంటావా” సాంగ్ స్పెషల్ ప్రోమో విడుదల…రెచ్చి పోయిన సమంత…!

by AJAY
Ad

ఈరోజు హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈవెంట్ లో చిత్ర యూనిట్ సందడి చేసింది. అల్లు అర్జున్ రష్మిక మందన ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అంతే కాకుండా ఈవెంట్ కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు సమంత చేసిన ఊ అంటావా.. ఊ ఊ అంటావా మామ అనే స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు.

Samantha oo antava సాంగ్

Samantha oo antava song

ఈ ప్రోమో లో సమంత తన డ్యాన్స్ తో ఆకట్టుకుంటోంది. బన్నీ తో కలిసి సమంత వేసిన స్టెప్పులు పాటకు ఎంతో ఊపు తెచ్చాయి. ఇక ఈ పాటతో పాటు స్వామి సామీ అనే పాట ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ పాటలో అల్లు అర్జున్ రష్మిక మందన తమ స్టెప్పులతో అలరించారు. ఇక పుష్ప సినిమా నుండి ఇప్పటికే ఈ రెండు లిరికల్ పాటలు విడుదల చేయగా యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.

Advertisement

Advertisement

ఇక ఈ రెండూ కూడా ఫోక్ సాంగ్స్ కావడంతో పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు డిఎస్పీ స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. గతంలోనూ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు డీఎస్పీ అనే స్వరాలు సమకూర్చారు. ఆ రెండు సినిమాల ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు పుష్ప ఆల్బం కూడా అదే రేంజ్ లో ఉందంటూ డిఎస్పీపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Visitors Are Also Reading