Home » డ‌బుల్ మీనింగ్ ప‌దాలు చెప్పాల‌ని కోరిన యాంక‌ర్…దిమ్మ తిరిగే ఆన్స‌ర్ ఇచ్చిన చైతూ..!

డ‌బుల్ మీనింగ్ ప‌దాలు చెప్పాల‌ని కోరిన యాంక‌ర్…దిమ్మ తిరిగే ఆన్స‌ర్ ఇచ్చిన చైతూ..!

by AJAY
Ad

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. చైతూ ఓవైపు సినిమాల‌లో మ‌రోవైపు వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం చైతూ థాంక్యూ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌న్ ను విడుద‌ల చేయ‌గా ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో అవికా గోర్, మాళ‌విక అయ్య‌ర్ హీరోయిన్ లుగా న‌టించారు.

Nagachaitanya

Nagachaitanya

ఈ సినిమా జూలై 22న విడుద‌ల కానుంది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా నాగ‌చైత‌న్య ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంట‌ర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ అంటూ డ‌బుల్ మీనింగ్ ప‌దాలు మాట్లాడాల‌ని యాంక‌ర్ కోరారు. దాంతో నాగ‌చైత‌న్య ఆ యాంక‌ర్ కు దిమ్మ‌తిరిగే ఆన్సర్ ఇచ్చారు. తన‌కు డ‌బుల్ మీనింగ్ ప‌దాలు రావ‌ని ఏదైనా సూటిగా మాట్లాడ‌తాన‌ని చెప్పారు. అంతే కాకుండా డబుల్ మీనింగ్ ప‌దాలు అంటే ఏవో నువ్వే చెప్పాల‌ని యాంక‌ర్ ను కోరారు.

Advertisement

Advertisement

ఇక ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే నాగ‌చైత‌న్య సమంత తో విడాకుల త‌ర‌వాత ఒంటరిగానే ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే చైతూ ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు నాగార్జున్ చైతూకు మ‌రో సంబంధం చూశాడ‌ని త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నాడ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading