Home » డీజీపీకి RGV కంప్లైంట్.. నాగబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్..!

డీజీపీకి RGV కంప్లైంట్.. నాగబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Ad

 ఇటీవల ఓ టీవీ ఛానెల్‌లో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్  షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే.  RGV తల న*రికి తెచ్చిన వారికి కోటీ రూపాయలు ఇస్తానంటూ సవాల్ చేశారు. దీనిపై ఘాటుగానే స్పందించిన ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొలికిపుడి శ్రీనివాస్ డిబేట్ లో నన్ను చం*పడానికి సూపారి ఇస్తానంటూ అతను కామెంట్స్‌ చేసినా.. ఆ డిబెట్ ను యాజమాన్యం కొనసాగించడం తప్పు అని ఫైర్ అయ్యారు ఆర్జీవీ.

nagababu

Advertisement

 

ఎప్పుడూ నన్ను చం*పడానికి ఎవరు సూపారి ఇవ్వలేదని అందుకే ఇప్పటివరకు తాను కంప్లైంట్ చెయ్యలేదని చెప్పారు ఆర్జీవీ. అయితే తాజాగా డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ప్రోసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా నాగబాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అది తెగ వైరల్ అవుతోంది. RGV తల న*రికితే కోటి ఇస్తానని ఆవేశంగా మాట్లడిన వ్యక్తి.. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎవరైన తనపై దాడి చేసే అవకాశం ఉందని తనకి ప్రాణహాని ఉందని పోలిస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.

RGV గారి పై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు.. నేను కూడ వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను .. RGV గారు మీరేం భయపడకండి మీ జీవితానికి ఏ డోఖా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఆ మాటకొస్తే ఇండియా లో ఏ పనికిమాలిన ఎధవా మీకెటువంటి హాని తలపెట్టడు ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడు చం*పడు కదా మీరేం వర్రీ అవకండి..కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి.. ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి  నాగబాబు అంటూ పోస్ట్ చేశారు.  నాగబాబు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading