Home » మంచు విష్ణు హెయిర్ స్టైలిష్ట్ పై నాగ‌బాబు పొగ‌డ్త‌ల వ‌ర్షం..!

మంచు విష్ణు హెయిర్ స్టైలిష్ట్ పై నాగ‌బాబు పొగ‌డ్త‌ల వ‌ర్షం..!

by AJAY
Ad

మంచు వారి ఫ్యామిలీ ఇప్పుడు త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏదో ఒక అంశంతో మంచు వారి ఫ్యామిలీ పై ట్రోల్స్ వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో విష్ణు హెయిర్ స్టైలిష్ట్ నాగ‌శ్రీను తో వివాదం దుమారం రేపింది. నాగ‌శ్రీను త‌న ఆఫీసులో దొంగ‌త‌నం చేశాడంటూ విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

ఆ వెంటనే నాగ‌శ్రీను తాను ఎలాంటి దొంగ‌తనం చేయ‌లేద‌ని తానను మోహ‌న్ బాబు మోకాళ్ల‌పై కూర్చోబెట్టి బూతులు తిడుతూ కులం పేరుతో దూషించాడని ఆరోపించాడు. అందువ‌ల్లే తాను ప‌నిమానేశాన‌ని ఆ కోపంతో కేసులు పెట్టార‌ని ఆరోపించాడు. ఇదిలా ఉండ‌గా ఈ వ్య‌వ‌హారంలో నాగ‌బాబు మ‌ధ్య‌లోకి వ‌చ్చారు. నాగ‌శ్రీనుకు రూ.50 వేలు ఆర్థిక‌సాయం అందించారు.

Advertisement

nagababu

nagababu

మా ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన గొడ‌వ‌ల వ‌ల్లే నాగశ్రీనుకు స‌పోర్ట్ చేశార‌నే కామెంట్లు వినిపించాయి. ఇక రీసెంట్ గా మంచు ఫ్యామిలీ ప‌నిమ‌నిషితో నాగశ్రీనుకు అక్ర‌మ సంబంధం ఉంద‌ని ఓ ఆడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ త‌ర‌వాత స‌ద‌రు మ‌హిళ ఆ పంచాయితీని తామే ప‌రిష్క‌రించుకున్నామ‌ని మంచు కుటుంబానికి ఆ ఇష్యూతో ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పింది.

ఇదిలా ఉండ‌గా తాజాగా నాగ‌బాబు నాగ‌శ్రీను టాలెంట్ ను చూపిస్తూ ఓ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో నాగ‌బాబును నాగ‌శ్రీను ఎంతో స్టైలిష్ గా త‌యారు చేశారు. ఈ ఫోటోకు నీ ప్ర‌తిభే నీ విజ‌యానికి మార్గం సుగుమం చేస్తుంద‌ని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఆరోజు అందుకే చెక్ ఇచ్చాను. న‌న్ను ఇలా అందంగా మార్చినందుకే ఇచ్చాను. న‌న్ను ఇలా అందంగా మార్చినందుకు థాంక్స్….అంటూ నాగ‌బాబు పేర్కొన్నారు.

Visitors Are Also Reading