Home » మంచు విష్ణు హెయిర్ స్టయిలిస్ట్ కు నాగబాబు ఆర్థికసాయం…!

మంచు విష్ణు హెయిర్ స్టయిలిస్ట్ కు నాగబాబు ఆర్థికసాయం…!

by AJAY
Ad

రీసెంట్ గా మంచు విష్ణు తన హెయిర్ స్టైలిస్టు నాగశ్రీను హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి ఎత్తుకెల్లాడని ఆరోపిస్తూ అతడి పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాను ఎలాంటి దొంగతనం చేయలేదని మోహన్ బాబు తనను దూషించడం తో పని మనేశానని నాగ శ్రీను అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని నాగశ్రీను ఆరోపించారు. అంతే కాకుండా తనను మోకాళ్ళ పై కూర్చోపెట్టి మోహన్ బాబు కొట్టాడని నాగ శ్రీను మీడియా ముందు చెప్పారు.

Advertisement

Advertisement

తన తల్లి అనారోగ్యం తో బాధపడుతోంది అని దానికి కారణం మోహన్ బాబు పెట్టించిన కేసులే అన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నాగ శ్రీను కు మెగా బ్రదర్ నాగబాబు ఆర్థికసాయం చేసారు. నాగబాబు హెయిర్ స్టయిలిస్ట్ నాగశ్రీను కు 50 రూపాయలు అందించారు. ఇదిలా ఉంటే ఇటీవల మా ఎన్నికల సమయం లో నాగబాబు మంచు విష్ణు మధ్య వార్ నడిచిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు నాగశ్రీను కు నాగబాబు సాయం చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Visitors Are Also Reading