Home » నాగబాబు ఎంపీగా పోటీ.. ఏ జిల్లా నుంచి అంటే..?

నాగబాబు ఎంపీగా పోటీ.. ఏ జిల్లా నుంచి అంటే..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఎంతటి సంచలన హీరోగా ఎదిగారో మనందరికీ తెలుసు. చిరంజీవి తర్వాత అంతటి గొప్ప పేరు సంపాదించుకున్న మెగా హీరో. ఇప్పటికి సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. జనసేన పార్టీ పెట్టి ఎలాగైనా ఈసారి సీట్లు సంపాదించడం కోసం కృషి చేస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ కు అన్న నాగబాబు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన ముందుగా రియాక్ట్ అవుతూ ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు.

also read:పవన్ కళ్యాణ్ చెల్లెలు వాసుకి లవ్ స్టోరీ.. నా భర్త అలాంటి వారంటూ..!!

Advertisement

పవన్ కళ్యాణ్ నిజాయితీ త్యాగనిరతిని ప్రజలందరికీ తెలియజేస్తామని, రాబోవు రోజుల్లో రాష్ట్ర ప్రజలను జనసేన పార్టీ పాలన వస్తుందని నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశారు. అయితే నాగబాబు కూడా ఈసారి ఎంపీగా పోటీ చేయనున్నారని అది కూడా అనకాపల్లి నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున అల్లు అరవింద్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం వారి మద్దతు పూర్తిగా లభిస్తుందని భరోసాతో ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయించేందుకు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

also read:చిరంజీవి కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారా..?

పార్టీ తరపున తాను నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో ఉంటామని, ఢిల్లీలో జనసేన వ్యవహారాలు చక్కబెట్టడానికి నాగబాబు సరైన వ్యక్తి అవుతారని పవన్ కళ్యాణ్ ఆలోచన. ఉభయగోదావరి,ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు , గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నియోజకవర్గల్లోనే జనసేన పోటీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం ఖరారు అయినట్టు కనబడుతోంది. ఈ ఏడు జిల్లాల్లోనే మెజారిటీ సీట్లను తీసుకోవాలని, అలాగే ఎంపీ సీట్లను కూడా ఈ జిల్లాలోని నాలుగు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈసారి ఈ జిల్లాల నుంచే బరిలోకి దిగుతారని సమాచారం.

also read:

Visitors Are Also Reading