Home » పవన్ కళ్యాణ్ సినిమాతో భారీ లాస్‌..కానీ NTR సేవ్‌ చేశాడా ?

పవన్ కళ్యాణ్ సినిమాతో భారీ లాస్‌..కానీ NTR సేవ్‌ చేశాడా ?

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాల్లో నటించడమే కాకుండా ప్రజలకు సేవ చేయడానికి జనసేన పార్టీని స్థాపించాడు. ఇక పవన్ కళ్యాణ్ మంచితనానికి, తన అద్భుతమైన నటనకు కోట్లాదిమంది అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ….పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

Naga Vamsi Claims 'Agnyathavasi' As The Most Challenging

Naga Vamsi Claims ‘Agnyathavasi’ As The Most Challenging

ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యంత చెత్త రికార్డుగా నిలిచిన సినిమా. కొన్నిచోట్ల ఈ సినిమా ఒకటి రెండు రోజులు కూడా సరిగ్గా ఆడలేదు. కొన్నిచోట్ల డిస్ట్రిబ్యూటర్లు వారిని ఆదుకోవాలని రోడ్డు కూడా ఎక్కారు. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండి ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులకు చేరువయ్యాడు. దీనికి సంబంధించి నిర్మాత నాగవంశీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నాడు.

Advertisement

Advertisement

అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయ్యాక ఆ బాధలోనే అందరం రెండు నెలలు గడిపాము. అలా ఒక రకమైన డిప్రెషన్ లో ఉన్న మా అందరికీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాతో హిట్ కొట్టారు. ఇక డిప్రెషన్ లో ఉన్న మా అందరికీ ఎన్టీఆర్ సపోర్ట్ గా నిలిచాడు. ఈ సంవత్సరం మనము హిట్ కొట్టబోతున్నాము అని చెప్పాడు. ఇక ఎన్టీఆర్ చెప్పినట్లుగానే అతి తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశాము అని ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నాగ వంశీ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading