Home » నాగచైతన్య కోట్ల విలువ చేసే లగ్జరీ బైకులు, కార్ల కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

నాగచైతన్య కోట్ల విలువ చేసే లగ్జరీ బైకులు, కార్ల కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

అక్కినేని నాగచైతన్య జోష్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై.. ఇండస్ట్రీలో మెల్ల మెల్లగా పాపులారీటిని సంపాదించుకుంటున్నాడు. ముఖ్యంగా  చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. యూత్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్నాడు. నాగచైతన్యకి కార్లు, స్పోర్ట్స్ బైకులు అంటే చాలా ఇష్టం. ఫెరారీ నుంచి మెర్సిడెస్ వరకు ఈ అక్కినేని ఇంటి గ్యారెజీలో భారీ కలెక్షన్లు దాగుంది. మార్కెట్ లోకి కొత్తగా ఏ స్పోర్ట్స్ బైకు వచ్చినా అతని మనసు చెప్పిందంటే చాలు.. వెంటనే దానిని తన గెరేజ్ లో ప్రత్యక్ష్యమవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే చైతూ దగ్గర లగ్జరీ బైకులు, కార్ల కలెక్షన్ భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. నాగచైతన్య దగ్గర ఉన్న ఖరీదైన వాహనాలు ఏంటి ? వాటి ధర ఎంతో తెలుసుకుందాం. 

Advertisement

BMWR9T :

నాగచైతన్య దగ్గర ఉన్నటువంటి బైకుల్లో అత్యంత ఖరీదైన బైకు BMWR9T  ఒకటి. 2014లో లాంచ్ అయిన ఈ బైకు కోసం చైతూ సుమారు రూ.19లక్షలు వెచ్చించి మరీ సొంతం చేసుకున్నాడు. ఈ బైకుతో విడాకుల కంటే ముందు సమంతతో చక్కర్లు కొట్టాడు. 

Triumph Thruxton R :

నాగచైతన్య సాధారణ  బైకులతో పాటు రేసు బైకులను కూడా చాలా ఇష్టపడుతాడు. అతను ఏ బైకును అయినా సరే కొనాలనుకుంటే చాలు.. దాని ఖరీదు ఎంత..? ఏంది ? అని కూడా ఆలోచించడు. సుమారు రూ.13లక్షలు విలువైన ఈ రేసర్ బైకు Triumph Thruxton R ని సొంతం చేసుకున్నాడు. 

Advertisement

Ferrari F 430 : 

 మార్కెట్ లో ఈ కారుకు క్రేజ్ మామూలుగా ఉండదు. జాన్సేనా నుంచి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరకు ఫెరారీ ఎఫ్ 430 రెడ్ బ్యూటీ కారుకు భారీ ఫాలోయింగే ఉంది. ఈ కారు ధర సుమారు రూ.1.75 కోట్లకు పైగా ఉంటుంది. అయితే నాగచైతన్య తన కార్ల కలెక్షన్లలో ఇది కూడా ఒకటి ఉండటం విశేషం. 

Mercede Benz G-Class G 63 :

నాగచైతన్య వద్ద ఉన్న ఈ మెర్సిడిస్ బెంజ్ కారు ఖరీదు దాదాపు కోటి రూపాయలకి పైగానే ఉంటుందట. చైతన్యతో పాటు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్, టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వద్ద కూడా ఈ కారు ఉండటం విశేషం. 

MV Agusta F4 : 

నాగచైతన్య వద్ద ఉన్న లగ్జరీ బైకుల్లో ఆయన ఫేవరేట్ MV Agusta F4. ఈ బైకు ధర దాదాపు రూ.26 నుంచి రూ.35లక్షలకు పైగా ఉంటుందట. ఈ బైకుపై చైతన్య షికార్లు చేస్తూ పలు సందర్భాల్లో మీడియా కంట కూడా కనిపించారట. వీటితో పాటు యమహా YZFR1 స్పోర్ట్స్ బైకు, హోండా స్పోర్ట్స్ బైకుతో సహా మరికొన్ని బైకులు  గ్యారేజీలో దర్శనమిస్తున్నాయి. 

మరికొన్నిముఖ్యమైన వార్తలు : 

 మా ఆయన పై ట్రోల్స్ చూసి అన్నం కూడా తినలేదు… థమన్ భార్య ఎమోషనల్…!

Visitors Are Also Reading