Home » సినిమా ఆఫర్స్ రాక నాగ చైతన్య షాకింగ్ నిర్ణయం ?

సినిమా ఆఫర్స్ రాక నాగ చైతన్య షాకింగ్ నిర్ణయం ?

by Bunty

ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ ని నడిపించడం చాలా కామన్ అయిపోయింది. సెలబ్రిటీల నుంచి చిన్న, మధ్య తరగతి కుటుంబాలు కూడా యూట్యూబ్ ఛానల్ ని నడిపిస్తున్నారు. సెలబ్రిటీలకు యూట్యూబ్ ఛానల్ అనేది ఓ ప్లస్ పాయింట్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి పర్సనల్ విషయాలు, సినిమాల గురించి ఏదో ఒక వీడియో రూపంలో వారు పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య కూడా ఓ యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించాడు.

అక్కినేని నాగచైతన్య పేరుతో యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించి అందులో అదిరిపోయే లుక్ తో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నానంటూ చెప్పుకొచ్చాడు. అభిమానులతో సరదాగా ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు. జుట్టు, గడ్డం పెంచడానికి కారణమేంటంటూ ఓ అభిమాని ప్రశ్నించగా…. ఎలాంటి పని, జాబ్ లేకుండా ఆరు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న అందుకే జుట్టు, గడ్డం పెంచాను అని సరదాగా చెప్పుకొచ్చాడు. మళ్ళీ ఆ తర్వాత తాను హీరోగా చేయబోయే చందు మొండేటి సినిమా కోసం జుట్టు, గడ్డం పెంచానంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ గురించి ప్రశ్నించగా…. ప్రతిరోజు దూతని కలవకుండా మీ డే ప్రారంభం అవదు ఇక దూత గురించి మరికొన్ని విషయాలను డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ ను అడగాలని చెప్పుకొచ్చాడు. ఇక ఏది ఏమైనాప్పటికీ నాగచైతన్య ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా అతనికి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక తాను నటించిన కస్తడి సినిమాతో ప్రేక్షకులను పెద్దగా ఆదరించలేకపోయినా చైతన్య, దూత అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు కాస్త దగ్గరయ్యాడు. ఇక నాగచైతన్య చేయబోయే తన తదుపరి చిత్రంలో ఏ మేరకు హిట్ సాధిస్తాడో చూడాలి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading