టాలీవుడ్ సినిమా అభిమానులు నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. దాదాపు 7 ఏళ్ళు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న వీరు ఇలా విడాకులు తీసుకోవడం పై చాలా చర్చలు జరిగాయి. అందులో కొంతమంది చైతన్యదే తప్పు అంటే.. మరి కొంతమంది సమంతదే తప్పు అన్నారు.
Advertisement
కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చైతన్యదే తప్పు అనే వాదన వస్తుంది. అదేంటంటే.. చైతన్య ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు అని తెలుస్తుంది. వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని అంటున్నారు. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒక్కరైనా సాయి పల్లవి.
Advertisement
అవును.. చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా చేస్తున్నప్పుడే ప్రేమలో పడ్డారని.. ఈ విషయం తెలిసిన సమంత విడాకులు తీసుకుంది అంటున్నారు. ఇక షూటింగ్ ఉంటేనే హైదరాబాద్ కు వచ్చే పల్లవి ఇప్పుడు దాదాపుగా గత ఆరు నెలల నుండి హైదరాబాద్ లోనే.. అది కూడా చైతన్య ఫ్లాట్ లో ఉంటుందని తెలుస్తుంది. అయితే చూడాలి మరి ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది.