Home » పాస్ లేకపోతే కోహ్లీలాగే ఫేస్ పెడతారు…!

పాస్ లేకపోతే కోహ్లీలాగే ఫేస్ పెడతారు…!

by Azhar
Ad

క్రికెట్ చరిత్రలో రన్ మెషిన్ గా పేరుతెచ్చుకున్న విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం దారుణంగా ఆడుతున్నాడు. బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతున్నాడు. ఈ వైఫల్యం కారణంగానే కెప్టెన్సీకి దూరమైన విరాట్.. ఐపీఎల్ లోనైనా తన మెరుపులు చూపిస్తాడు అనుకుంటే.. ఇక్కడ కూడా అదే వైఫల్యంను కొనసాగిస్తున్నాడు. ఈ ఐపీఎల్ లో ఆడిన ఆరు మ్యాచ్ లలో ఒక్క మాస్క్ లో మినహా అన్ని మ్యాచ్ లలో విఫలమయ్యాడు.

Advertisement

అయితే నిన్న బెంగళూర్, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు కోహ్లీ. మొదటి బంతిని క్యాచ్ గా ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే ఔట్ అయిన తర్వాత కోహ్లీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తెగ వైరల్ అవుతుంది. దీని పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇక మన తెలంగాణ ఆర్టీసీ కమిషనర్ వి.సి. సజ్జనార్.. సొసైల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు అనేది తెలిసిందే.

Advertisement

ఆయన ప్రజలకు మంచి విషయాలను కొంచెం ఫన్ యాడ్ చేసి చెబుతుంటారు. ఇప్పుడు ఆయన కూడా కోహ్లీ యొక్క ఈ ఎక్స్ప్రెషన్ పై తన స్టైల్ లో స్పందించారు. ఈ ఫోటోను తన ట్వియితీ లో పోస్ట్ చేసి.. బస్సులో ఎక్కిన తర్వాత కండెక్టర్ వచ్చి పాస్ అడిగితే… అప్పుడు బస్ పాస్ ఇంట్లో మర్చిపోతే మన ఇచ్చే రియాక్షన్ ఇదే అని తెలిపారు. అలాగే మీరు ఎప్పుడైనా పాస్ మర్చిపోయి బస్ ఎక్కారు అని ప్రశ్నించారు. ప్రస్తుతం సజ్జనార్ ట్విట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :

బట్లర్ క్రీడాస్ఫూర్తికి అభిమనులు ఫిదా…!

ముంబై పని ఖతం.. గుడ్ బై చెప్పిన ఫ్యాన్స్…?

Visitors Are Also Reading