Home » చాహల్ పోజ్ పై పేలుతున్న మీమ్స్..!

చాహల్ పోజ్ పై పేలుతున్న మీమ్స్..!

by Azhar
ఐపీఎల్ 2022 లో నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్..కోల్కతా నైట్ రైడర్స్ పై హ్యాట్రిక్ తీసిన విషయం తెలిసిందే. అయితే చాహల్ వేసిన ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ ను రాయల్స్ వైపుకు తిప్పింది. దాంతో ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇక సహజంగానే ఎప్పుడు సోషల్ మీడియాలో కామెడీ చేసే చాహల్ ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ తీసిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి.. ఓ రకామైన పోజ్ ఇస్తూ కూర్చున్నాడు. దానిపై ఐపీఎల్ మీమర్స్ చెలరేగుతున్నారు. క్లాస్ లో నుండి టీచర్ బయటికి వెళ్ళమంటే.. అమ్మాయిలు ఏడుస్తారు… కానీ అబ్బాయిలు బయటికి వెళ్లి ఇలానే కూర్చుంటారు అని అంటున్నారు.
అలాగే చిన్నపిల్లలు కొంతమంది ఇలానే మారం చేస్తారు అని అంటున్నారు. బొమ్మల దుకాణంలో డాడీ బొమ్మ కొన్నికవకపోతే పిలల్లు షాప్ లో ఇలానే కూర్చుంటారు అని చెప్పాడు. అయితే చాహల్ ఈ ఫోజ్ ఇచ్చిందే మీమర్స్ కోసం అని మ్యాచ్ చూసే అందరికి తెలిసిందే. గతంలో కూడా చాలా పోజ్ ల పైన చాలానే మీమ్స్ వచ్చాయి.
ఇవి కూడా చదవండి :
Visitors Are Also Reading