పాన్ ఇండియా అగ్ర దర్శకుడు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి సినిమా తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దాదాపు మూడేండ్ల పాటు ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి తెరకెక్కించాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన అద్భుతమనే చెప్పాలి. టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చెందిన నటీనటులు, టెక్నిషిన్లు ఈ సినిమా కోసం పని చేశారు.
ముఖ్యంగా ఈ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు నాటు నాటు సాంగ్ కు పోటాపోటీగా డాన్స్ చేశారు. దీంతో ఈ సాంగ్ సోషల్ మీడియాలో విడుదలైన కొద్ది సేపటికే ట్రెండింగ్ లోకి దూసుకెళ్లి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఇదే సమయంలో దర్శకుడు రాజమౌళి నెటిజన్లకు అడ్డంగా దొరికి పోయాడు. ఈ పాట పూర్తిగా ఓ ఆఫ్రికన్ సినిమాలోని ఓ సాంగ్‌ను యాజ్‌టీజ్గా దింపినట్టుంది. దీంతో నాటు నాటు సాంగ్ కాపీ అని తేలిపోవడంతో నెటిజన్లు ఆయనపై ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాలో కాక్రోచ్ అనే మూవీకి కాపీనని.. బాహుబలి మూవీ పోస్టర్ ఓ ఇంగ్లీషు సినిమాను కాపీ కొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
Advertisement
Also Read : RRR కి బాహుబలి కి మించి బ్లాక్ బస్టర్ టాక్ రావడానికి కారణమైన సీన్స్ అవే నట !
ఈ విషయంలో రాజమౌళికి పలువురు మద్దతు ఇస్తుండగా మరికొందరు మాత్రం విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య సోషల్ మీడియాలో వాడివేడి చర్చ నడుస్తోంది. ‘నాటు నాటు’ సాంగ్ ఆర్ఆర్ఆర్ మూవీకి కావాల్సినంత ప్రచారాన్ని అందించటంతో రాజమౌళి దీనికి పెద్దగా స్పందించడం లేదు. ఇవాళ ఈ సినిమా విడుదలై అదిరిపోయే టాక్ రావడంతో వారంతా హ్యపీగా ఫీలవుతున్నారు. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాను వీక్షించి తమ స్పందనను తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా చిత్ర బృందానికి హ్యాట్సాప్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Also Read : ఆర్ఆర్ఆర్ థియేటర్ తో గన్ తో హల్చల్…పరుగులు తీసిన ప్రేక్షకులు..!