Home » ఆర్ఆర్ఆర్ థియేట‌ర్ తో గ‌న్ తో హ‌ల్చ‌ల్…ప‌రుగులు తీసిన ప్రేక్ష‌కులు..!

ఆర్ఆర్ఆర్ థియేట‌ర్ తో గ‌న్ తో హ‌ల్చ‌ల్…ప‌రుగులు తీసిన ప్రేక్ష‌కులు..!

by AJAY
Ad

రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్నో అంచనాల మ‌ధ్య నేడు థియేట‌ర్ ల‌లో విడుద‌లైంది. ఇక ఈ సినిమాకు విశేష స్పంద‌న వస్తోంది. అటు ఏపీ ఇటు తెలంణాతో పాటూ దేశ‌వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ క్రేజ్ క‌నిపిస్తోంది. ఇక ఇద్ద‌రు స్టార్ హీరోలు ఉండ‌టంతో ఉద‌యం నుండి థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల సంద‌డి క‌నిపిస్తోంది.

Advertisement

కానీ తాజాగా ఏపీలోని పిఠాపురంలో ఓ అభిమాని థియేట‌ర్ వ‌ద్ద గ‌న్ తో క‌నిపించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. పిఠాపురానికి చెందిన ఓ వ్య‌క్తి గ‌న్ తో థియేట‌ర్ కు వ‌చ్చాడు. అంతే కాకుండా థియేట‌ర్ ముందు ఫోటోల‌కు ఫోజులు ఇచ్చాడు. ఆ త‌ర‌వాత సినిమా ర‌న్ అవుతున్న స‌మ‌యంలో కూడా హీరోలు ఎలా కాల్పులు జ‌రిపారో అలా గాల్లో కాల్పులు జ‌రిపాడ‌ని ప్రేక్ష‌కులు చెబుతున్నారు.

Advertisement

ఇక ఆ వ్య‌క్తిని చూసి కొంత‌మంది దూరంగా ప‌రుగులు తీసిన‌ట్టుగా కూడా స‌మాచారం. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి పొడుగాటి గ‌డ్డం తో న‌ల్ల క‌ల్ల‌జోడు పెట్టుకుని క‌నిపిస్తున్నాడు. యువ‌కుడు గ‌న్ తో హ‌ల్చ‌ల్ చేసిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. పిఠాపురంలోని సీ అన్న‌పూర్ణ థియేర‌ట్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇక గ‌న్ కొంత‌మంది డ‌మ్మీ గ‌న్ అంటూ ఉండ‌గా మ‌రికొంద‌రు ఎయిర్ గ‌న్ అని చెబుతున్నారు. అంతే కాకుండా గ‌న్ తో హ‌ల్చల్ చేసిన వ్య‌క్తి పిఠాపురానికి చెందిన హిందూప‌రిష‌త్ లో స‌భ్యడ‌ని స‌మాచారం.

Visitors Are Also Reading