Home » జగన్ ని పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు.. గర్జించిన జనసేనాని

జగన్ ని పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు.. గర్జించిన జనసేనాని

by Anji
Ad

సిద్ధం అంటున్న వైఎస్ జగన్ కి యుద్ధం ఇద్దామని జనసేన-టీడీపీ కార్యకర్తలకు జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వచ్చే 45 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని.. వైసీపీ గూండాయిజానికి జనసేన, టీడీపీ కార్యకర్తలు భయపడొద్దన్నారు. వైసీపీ గూండాలకు హెచ్చరిక జారీ చేస్తున్నామని.. తమ సభలపై కానీ, నాయకులు, కార్యకర్తలపై కానీ సామాన్యుల పై కానీ దాడి చేస్తే.. భయపెడితే, బెదిరిస్తే మక్కెలు ఇరగ్గొట్టి మడతపెట్టి మంచంలో పెడతామని హెచ్చరించారు.

Advertisement

తాడెపల్లి గూడెంలో టీడీపీ-జనసేన తెలుగు విజయకేతనం జెండా సభలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ తో కూటమి నేతల్లో మంచి జోష్ నింపారు. సీఎం జగన్ యువతరానికి ఏ సంపద విడిచిపెట్టారు. ఈ ఐదేళ్ల పాలనలో యువత, రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగాలు, అంగన్ వాడీ కార్యకర్తలను మోసం చేశారని తెలిపారు. ఇలా అందరినీ మోసం చేసిన జగన్ కి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. నేను ఒక్కడినే అంటూ జగన్ ఊదరగొడుతున్నారు. ఒక్క ఎమ్మెల్యేని లాక్కెళ్లిన నువ్వా ఒక్కడివి..? జగన్ నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఫామ్ హౌస్ లో ఏం చేసేవాడో నాకు తెలుసు. నీ వ్యక్తిగత జీవితం గురించి నా దగ్గర టన్నుల కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంది జగన్.. మాట్లాడితే నాకు 4 పెళ్లిళ్లు అంటాడు.. 4వ పెళ్లాం నువ్వేనా జగన్. ఒకవేళ నువ్వే 4వ పెళ్లాం అయితే రా జగన్ అంటూ సెటైర్లు వేశారు.

Advertisement

వైసీపీ వాళ్లకు 24 పవర్ గురించి తెలియడం లేదు. బలిచక్రవర్తి కూడా వామనుడిని చూసి అంతేనా అన్నారు. నెత్తి మీద తొక్కుతుంటే తెలిసింది ఆయన బలం ఎంతో అని.. వైసీపీకి వామన అవతారం చూపిస్తాం. పాతాళానికి తొక్కుతాం. జగన్ నిన్ను అథ:పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు.. నా పార్టీ జనసేన కాదు గుర్తు పెట్టుకో జగన్. రేపు ఎన్నికలు ముగిసిన తరువాత వైసీపీకి మన బలం ఏంటో తెలుస్తోంది. జనసేన శ్రేణులు కూడా వ్యూహం నాకు వదలండి. నేను యుద్ధం చేస్తుంది మామూలు వ్యక్తితో కాదు.. సొంత బాబాయ్ ని చంపిన జగన్ అనే వ్యక్తితో.. సొంత చెల్లిని గోడకేసి గుద్దిన వ్యక్తితో యుద్ధం చేస్తున్నామని తెలిపారు. జగన్ ఎలాంటి వాడో మీకు తెలియదు.. నాకు తెలుసు.. దయచేసి నాకు సలహాలు ఇచ్చేవారు అర్థం చేసుకోవాలి. టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని కోరారు పవన్ కళ్యాణ్.

Also Read :   “ఆదిత్య 369” టైటిల్ లో 369 నంబ‌ర్ ఎందుకు పెట్టారో తెలుసా..? ఆ నంబ‌ర్ అర్థం ఏంటంటే..?

Visitors Are Also Reading