Home » అతడు సినిమా ముందుగా ఉదయ్ కిరణ్ హీరోగా అనుకున్నారట మురళి మోహన్ ..! మరి ఎందుకు తియ్యలేదంటే ?

అతడు సినిమా ముందుగా ఉదయ్ కిరణ్ హీరోగా అనుకున్నారట మురళి మోహన్ ..! మరి ఎందుకు తియ్యలేదంటే ?

by AJAY
Ad

చిత్రం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉద‌య్ కిర‌ణ్ ప్రేక్ష‌కుల మ‌నుసు దోచేశాడు. ఆ త‌ర‌వాత మ‌న‌సంతా నువ్వే, నీస్నేహం సినిమాల‌తో వ‌రుస హిట్లు అందుకున్నాడు. దాంతో ఒక్క‌సారిగా ఉద‌య్ కిర‌ణ్ కు స్టార్ స్టేట‌స్ వ‌చ్చేసింది. అప్ప‌ట్లో స్టార్ హీరోల సినిమా ఫంక్ష‌న్ ల‌కు సైతం ఉద‌య్ కిర‌ణ్ గెస్ట్ గా వెళ్లిన సంధ‌ర్బాలు ఉన్నాయి. అలాంటి ఉదయ్ కిర‌ణ్ కు వ‌రుస ఫ్లాప్ లు ప‌డ‌టం. వ‌చ్చిన ఆఫ‌ర్ ల‌ను సైతం వెన‌క్కి తీసుకోవ‌డం వ‌ల్ల మెల్లి మెల్లిగా కెరీర్ డౌన్ అయ్యింది.

Advertisement

చివ‌రికి డిప్రెష‌న్ లోకి వెళ్లిన ఉద‌య్ కిర‌ణ్ సినిమాలకే కాకుండా మ‌న‌సుముక్క‌లై ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయాడు. ఇక ఉద‌య్ కిర‌ణ్ కెరీర్ లో కొన్ని సూప‌ర్ హిట్ సినిమాలు కూడా మిస్ అయ్యాయి. ఆ సినిమాల లిస్ట్ లో మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన అత‌డు సినిమా కూడా ఉంది. ఈ విష‌యాన్ని నిర్మాత న‌టుడు ముర‌ళీమోహ‌న్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో భ‌య‌ట‌పెట్టారు.

Advertisement

ఉదయ్ కిర‌ణ్ ను మొద‌టి సినిమాలో చూసిన‌ప్పుడే చాలా అందంగా ఉన్నాడ‌ని అనుకున్న‌ట్టు ముర‌ళీమోహ‌న్ తెలిపారు. తాను మొద‌టి సినిమా చూసిన త‌ర‌వాత‌నే ఉద‌య్ కిర‌ణ్ కు ఫోన్ చేసి అభినందించాన‌ని చెప్పారు. ఆ త‌ర‌వాత ఉద‌య్ కిర‌ణ్ త‌మ ఇంటికి కూడా వ‌చ్చి వెళుతుండేవాడని అన్నారు. ఆ స‌మ‌యంలో అత‌డు సినిమాలో మొద‌ట ఉద‌య్ కిర‌ణ్ నే హీరోగా అనుకున్నామ‌ని చెప్పారు.

ఆ విష‌యాన్ని ఉద‌య్ కిర‌ణ్ కు చెప్ప‌గా న‌టిస్తాన‌ని చెప్పాడ‌ని అన్నారు. ఆ సినిమా ఫైన‌లైజ్ అయ్యే స‌మ‌యానికి చిరంజీవి కూతురుతో పెళ్లి అనే వార్త‌లు వ‌చ్చాయ‌ని అన్నారు. ఆ త‌ర‌వాత ఉద‌య్ కిర‌ణ్ ను అత‌డు కోసం మ‌ళ్లీ సంప్ర‌దించామ‌ని కానీ వ‌రుస సినిమాల‌తో డేట్స్ స‌ర్దుబాటు కావ‌డం లేద‌ని చెప్పాడ‌ని అన్నారు. ఆ త‌ర‌వాత మహేశ్ బాబును హీరోగా తీసుకున్నామ‌ని చెప్పారు.

ALSO READ : ఆషాఢమాసం లో అత్త కోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటారు ! దానికి కారణాలు ఏంటి ?

Visitors Are Also Reading