Home » మునుగోడు ఉపఎన్నిక‌ స‌ర్వేలో ఊహించ‌ని ఫ‌లితాలు..! ఏ మండ‌లంలో ఏ పార్టీ ప్ర‌భావం ఉందంటే..?

మునుగోడు ఉపఎన్నిక‌ స‌ర్వేలో ఊహించ‌ని ఫ‌లితాలు..! ఏ మండ‌లంలో ఏ పార్టీ ప్ర‌భావం ఉందంటే..?

by AJAY
Ad

మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతుండడంతో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ కనిపిస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో సైతం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలో పలు సర్వే సంస్థలు మునుగోడులో గెలుపు ఎవరిది అన్న దిశగా సర్వేలు సైతం నిర్వహిస్తున్నాయి. ఇక తాజాగా కాంపాక్ట్ (COPACT) సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలుబ‌డ్డాయి. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌లాల వారిగా వివరాలు ఇప్పుడు చూద్దాం…

Advertisement

మునుగోడు మండ‌లం
మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఏడు మండ‌లాలు ఉన్నాయి. వీటిలో మునుగోడు మండలంలోనే అత్యధిక ఓట్లు ఉన్నాయి. మునుగోడు మండలంలో మొత్తం 36వేల ఓట్లు ఉండగా 27 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఎక్కువ ఓట్లు ఉండడం వల్ల అన్ని పార్టీల చూపు మునుగోడు మండలం పైనే ఉంది. ఇక్కడ బిజెపి టిఆర్ఎస్ రెండు పార్టీలు బహిరంగ సభలను నిర్వహించాయి. ఈ మండలంలో చీకటిమామిడి, కొరటికల్ మేజర్ పంచాయతీలుగా ఉన్నాయి. కాగా వీటిలో కొరటికల్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ కి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఈ గ్రామంలో అందరూ ఒక రోజు బిజెపిలో చేరితే మరొక రోజు టిఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇక్కడ రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి. ఈ గ్రామంలో కాంగ్రెస్ ప్రభావం కూడా కనిపిస్తోంది. అయితే ప్రధానంగా మాత్రం బిజెపి వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్టుగా ఉంది.

నాంపల్లి మండలం
నాంపల్లి మండలం లో 35 వేల‌ ఓట్లు ఉన్నాయి. ఈ మండలం కాస్త వెనుకబడిన గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఎస్టీ లంబాడీలు ఉన్నారు. తాండాలలో టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి మూడు పార్టీలు త్రిముఖంగా పోటీ పడుతున్నాయి. ఇక్కడ డబ్బు మద్యం ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.

మర్రిగూడ మండలం
మర్రిఇగూడ మండలంలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి శివన్న గూడెం ప్రాజెక్టు, మరొకటి చెర్లగూడెం ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్టుల్లో గ్రామస్తులు భూములను కోల్పోవడం జరిగింది. దాంతో వీరికి రావాల్సిన నష్టపరిహారం పూర్తిగా అందలేదు. అయితే ఇప్పుడు వీరికి ప్రభుత్వం అకౌంట్లో డబ్బులు వేసి ఫ్రీజ్ చేసి ఉంచినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం పైన వ్యతిరేకతను తగ్గించుకునేందుకు టిఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్లే ఈ నష్టపరిహారం అందిందని ఆయన వైపు సైతం మొగ్గు చూపేవారు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ బిజెపికి అనుకూల వాతావరం కనిపిస్తోంది.

చండూరు మ‌న్సిపాలిటీ
మునుగోడు నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో ఒకటి చండూరు, చండూరు మున్సిపాలిటీలో యువత ఎక్కువగా ఉన్నారు. ఇందులో 75% బిజెపి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇక్కడ కూడా డబ్బు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ ఒక్కో ఓటుకు ఐదు నుండి పదివేల వరకు ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇక్కడ డబ్బు ప్రభావం ఎక్కువగా పనిచేసింది. మున్సిపాలిటీలో బిజెపి ప్రభావం ఎక్కువగా ఉంటే గ్రామాలలో టిఆర్ఎస్ బిజెపిల మధ్య పోటీ కనిపిస్తోంది. మరో వైపు ఇక్కడ టిఆర్ఎస్ లేదా బిజెపి ఏ పార్టీ కండువా కప్పుకున్నా 10వేల‌ నుండి 15వేల‌ వరకు పుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది.

నారాయ‌ణ‌పురం మండలం
నారాయణపురం మండలంలో తండాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తండాల‌లో ఎక్కువగా టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభావం కనిపిస్తోంది. డబ్బు మద్యం సైతం ఇక్కడ రాజకీయాలను వేగంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు నారాయణపురం మండలం పరిసర ప్రాంతాలలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ. ఈ మండలాల్లో కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు కీలకంగా మారే అవకాశం ఉంది.

చౌటుప్ప‌ల్ మున్సిపాలిటీ
చౌటుప్పల్ మండలంలో మద్యం డబ్బు ప్రభావం ఎక్కువ కనిపిస్తోంది. ఈ మండలంలోని ఓ గ్రామానికి సీఎం ఇన్చార్జిగా ఉన్నారు. దాంతో మండలం పై టీఆర్ఎస్ ఫోకస్ పెంచింది. చండూరు తర్వాత మునుగోడు లో ఉన్న మరో మున్సిపాలిటీ ఇదే. ఇది జాతీయ రహదారిని ఆనుకుని ఉండటం హైదరాబాద్ కు దగ్గరగా ఉండటం వల్ల ఈ మండలంలో రాజకీయాలపై అవగాహన ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా రాజకీయాలు రోజు రోజుకి మారుతున్నాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో గౌడ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. కాబట్టి అన్ని పార్టీలు సైతం ఈ సామాజిక వర్గంపై దృష్టి పెట్టాయి. ఇక్కడ బిజెపి టిఆర్ఎస్ మధ్య పోటీ కనిపిస్తోంది.

Visitors Are Also Reading