Home » ముకేశ్ అంబానీ, నీతా అంబానీల ప్రేమ కథ తెలుసా..? అంబానీ ఎలా ప్రొపోజ్ చేసారంటే..?

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల ప్రేమ కథ తెలుసా..? అంబానీ ఎలా ప్రొపోజ్ చేసారంటే..?

by Sravya
Ad

సెలబ్రిటీ కంటే ఎక్కువ ఫేమస్ అయిపోయారు ముకేశ్ అంబానీ. దేశంలోనే అతిపెద్ద ధనవంతుడిగా ప్రపంచ కుబేరుల్లో ఒకడుగా ముకేశ్ అంబానీ మనకి సుపరిచితం. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీళ్ళ ప్రేమ కథ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక మరి వీళ్ళ ప్రేమ కథ చూద్దాం. నీతా అంబానీ మంచి డాన్సర్. ఆమె డాన్స్ ని చూసి ధీరుభాయ్ అంబానీ ఇంప్రెస్ అయిపోయారు.

Advertisement

ఆమె ముఖేష్ అంబానికి మంచి జోడి అని అనుకున్నారు. తల్లిదండ్రులను ఇంటికి పిలిపించి పెళ్లి సంబంధం మాట్లాడారు. అయితే పెళ్లికి ఓకే అని రెండు ఫ్యామిలీలు చెప్పుకోలేదు ఆ టైంలో ముకేశ్ అంబానీ నీతా అంబానీ కొన్ని రోజులు పాటు చూసి ఇష్టా ఇష్టాలని తెలుసుకుని తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. 

Advertisement

ముఖేష్ అంబానీ ఒక రోజు ప్రేమ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక కారు లో తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలని అనుకున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ లో ఇరుక్కున్నప్పుడు ఇదే సరైన సమయం అని ప్రపోజ్ చేశారు. నీతా అంబానీ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఇంతలో గ్రీన్ సిగ్నల్ పడింది ముకేశ్ అంబానీ కారు మాత్రం తీయడం లేదు వెనకాల వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి.

హారన్ కొడుతూ వున్నారంతా. ఏదో ఒక సమాధానం చెప్పే వరకు కారుని ముందుకు తీసుకు వెళ్లనని ముకేశ్ అంబానీ చెప్పారు ముకేశ్ అంబానీ తో నీతా అంబానీ తనకి కూడా ఇష్టమేనని చెప్పారు. దాంతో కారుని ముందుకి తీసికెళ్ళారు. ఇలా వీళ్ళది వెరైటీ లవ్ స్టోరీ. ఆఖరికి వీళ్లిద్దరు 1985 మార్చి, 8న పెళ్లి చేసుకున్నారు.

Also read:

భయంకరమైన రోగాల నుండి బయట పడ్డ.. 5 స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!

చిరు అభిమాని ఎలా నాగబాబు భార్య అయ్యారు..? ఇంత పెద్ద కథ ఉంది మీకు తెలుసా..?

బాలకృష్ణ, రాజమౌళి కాంబినేషన్లో మిస్ అయిన 2 సినిమాలు ఏవో మీకు తెలుసా..?

Visitors Are Also Reading