ప్రపంచ కుబేరుల లిస్ట్ లో ముకేశ్ అంబానీ కూడా ఒకరు. వ్యాపార రంగంలో సత్తా చాటుతూ రోజు రోజుకు తన వ్యాపారాలను విస్తరిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెడుతూ దూసుకుని పోతున్నారు. ఇక ఆ రేంజ్ వ్యక్తి అంటే ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే విలువైన కంపెనీలో రిలయన్స్ సంస్థ ముందంజలో ఉంటుంది. అయితే ముకేశ్ అంబానీ ఇంట్లో పనిచేసే పని మనుషుల జీతాలు, జీవితాలు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట.
READ ALSO : ఛార్మి వల్లేనా ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు?
Advertisement
ముంబైలోని 27 అంతస్తుల ఇంట్లో 600 మంది పని చేస్తారట. ఇంతటి విలాసవంతమైన ఇంట్లో పనిచేసే వారి జీతాలు కూడా ఏ రేంజ్ లో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా, తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగికి ముఖేష్ అంబానీ ఏకంగా రూ.1,500 కోట్ల ఖరీదు చేసే ఇంటిని బహుమతిగా ఇచ్చేశారు. ముఖేష్ రైట్ హ్యాండ్ గా పిలిచే మనోజ్ మోడీకి ముంబైలోని నేపియన్ సి రోడ్ లో ఒక విలాసవంతమైన బిల్డింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు.
Advertisement
READ ALSO : దసరా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ స్థానంలో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉండేదో తెలుసా ?
22 అంతస్తులు ఈ భవనం 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో అత్యాధునిక సదుపాయాలు అందులో ఉన్నాయి. రిలయన్స్ రిటైల్ అండ్ రిలయన్స్ జియోలో డైరెక్టర్ గా పనిచేస్తున్న మనోజ్ మోడీ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ, మనోజ్ మోడీలు ఇద్దరు బ్యాచ్ మేట్స్. ముంబై లోని యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో వీళ్ళు కలిసి చదువుకున్నారు. రిలయన్స్ సాధించిన అనేక విజయాలలో మనోజ్ మోడీ పాత్ర ఎంతో కీలకం అని వ్యాపార వర్గాలు అంటున్నాయి.
READ ALSO : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం.. టీడీపీకి 100 సీట్లు పక్కా !