Home » 700 సినిమాల్లో 200 సినిమాల్లో తాగుబోతు పాత్రలే….ఎంఎస్ నిజంగానే తాగి నటించేవారా..?

700 సినిమాల్లో 200 సినిమాల్లో తాగుబోతు పాత్రలే….ఎంఎస్ నిజంగానే తాగి నటించేవారా..?

by AJAY

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా రాణించిన వారిలో ఎంఎస్ నారాయణ కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన మన మధ్యన‌ లేకపోయినా మీమ్స్ రూపంలో ఇప్పటికీ నెటిజ‌న్ల‌ను న‌వ్విస్తూనే ఉన్నారు. సొంతం, దూకుడు, హ‌నుమాన్ జంక్ష‌న్ లాంటి సినిమాల్లో ఎంఎస్ నట విశ్వరూపం చూపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. వృత్తిరీత్యా లెక్చరర్ అయిన ఎంఎస్ సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ క‌మెడియ‌న్ గా ఎదిగారు.

ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే….ఎంఎస్ అసలు పేరు మైలవరపు సూర్యనారాయణ…. కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు లెన్త్ ఎక్కువగా ఉందని షార్ట్ చేసి ఎంఎస్ అని స్క్రీన్ పై వేశారట. ఆయ‌న‌ కేవలం న‌టుడిగానే కాకుండా దర్శకుడిగా… రచయితగా సైతం పని చేశారు. అంతేకాకుండా కేవలం 17 ఏళ్ల సినీ కెరీర్ లోనే 700కు పైగా చిత్రాల్లో నటించారన్న సంగతి చాలా మందికి తెలియదు. అయితే వాటిలో 200 సినిమాల్లో తాగుబోతు పాత్రల‌నే చేశారు.

ms narayana

ఇక ఎంఎస్ నారాయణకు నటుడుగా గుర్తింపు తెచ్చిపెట్టిన మొదటి సినిమా మా నాన్నకు పెళ్లి. 1997లో ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో ఎంఎస్ తాగుబోతు పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు అందడంతో…. ఆ తర్వాత 200 సినిమాల్లో తాగుబోతు పాత్రల‌లో నటించారట. అంతే కాకుండా ప్రయత్నం, ముగ్గురు మొనగాళ్లు, పేకాట పాపారావు, వేగుచుక్క పగటి చుక్క లాంటి సినిమాలకు ఎంఎస్ కథల‌ను అందించారు అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు.

ms narayana

ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ నారాయ‌ణ మాట్లాడుతూ…. తన వద్దకు ఓ వ్యక్తి వచ్చి సినిమాల్లో మీరు తాగి నటిస్తారా అని ప్రశ్నించాడ‌ని చెప్పారు. దానికి తాను…. లేదయ్యా నేను తాగి నటించను. నాకు సరస్వతి దేవి అంటే అపారమైన భక్తి ఇష్టం. అందుకే ముఖానికి మేకప్ వేసుకున్నాక తాగుబోతు పాత్రల‌లో నటించడానికి సిద్ధం కానీ… తాగినటించ‌డానికి అస్స‌లు ఒప్ప‌కోను అని స‌మాధానం ఇచ్చిన‌ట్టు తెలిపారు.

Visitors Are Also Reading