Home » Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ఆ సింగర్‌తో పీకల్లోతు ప్రేమలో..!

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ఆ సింగర్‌తో పీకల్లోతు ప్రేమలో..!

by Bunty
Ad

Mrunal Thakur :  మృనాల్ ఠాకూర్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. సీతారామం సినిమాలో తన అద్భుతమైన నటన, అమాయకత్వం, అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా అనంతరం వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ పోతుంది ఈ ముద్దుగుమ్మ. దాదాపు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంటుంది.

Mrunal, Badshah hold hands at Shilpa Shetty's Diwali bash, spark dating rumours

Mrunal, Badshah hold hands at Shilpa Shetty’s Diwali bash, spark dating rumours

ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియాలో ఓ హాట్ న్యూస్ తో తెగ వైరల్ అవుతుంది. ఈ అమ్మడు ఓ వ్యక్తిని ప్రేమిస్తుందని త్వరలోనే వివాహం చేసుకోబోతుందనే వార్త వైరల్ అవుతుంది. మృనాల్….ర్యాప్ సింగర్ అయినటువంటి బాద్షాతో ప్రేమలో ఉందని, అతనితో డేటింగ్ కూడా చేస్తుందని బాలీవుడ్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. బాద్షా సింగర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ కంపోజర్, లిరిసిస్ట్ అయినటువంటి బాద్షా ఈ బ్యూటీతో చాలా హిట్ ఆల్బమ్స్ చేశాడట.

Advertisement

Advertisement

ఆ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడిపోయారట. రీసెంట్ గా జరిగిన శిల్పా శెట్టి ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు మృణాల ఠాకూర్, బాద్షా ఇద్దరు కలిసివచ్చారు. అంతేకాకుండా ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. దీంతో వీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading