Home » ఎమ్మార్వోకు 6 నెలల జైలుశిక్ష.. ఏపీ హై కోర్టు కీల‌క తీర్పు

ఎమ్మార్వోకు 6 నెలల జైలుశిక్ష.. ఏపీ హై కోర్టు కీల‌క తీర్పు

by Anji
Ad

ఏపీ హై కోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. ఓ మండ‌ల త‌హ‌సీల్దార్‌కు జైలు శిక్ష‌తో పాటు జరిమానా విధించింది. కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో క‌ర్నూలు జిల్లాలోని బెళ‌గ‌ల్ ఎమ్మార్వోకు హైకోర్టు జైలు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. ఎమ్మార్వో జే.శివ‌శంక‌ర నాయ‌క్ కు ఆరు నెల‌ల జైలు శిక్ష‌తో పాటు రూ.2వేలు జ‌రిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మండ‌లంలోని కొత్త‌కోట‌లోని భూమి మ్యూటేష‌న్ కోసం ఓ రైతు ధ‌రఖాస్తును ఎమ్మార్వో ప‌ట్టించుకోక‌పోవ‌డంతో హై కోర్టు విచార‌ణ చేప‌ట్టింది.

Also Read :  ట్రోల‌ర్స్ పై క‌న్నెర్ర చేసిన పెద‌రాయుడు…అవి తొల‌గించ‌క‌పోతే 10కోట్లు క‌ట్టాల్సిందే.!

Advertisement


క‌ర్నూలు జిల్లా సి. బెళ‌గ‌ల్ మండ‌లం ముడుమాల గ్రామానికి చెందిన పింజ‌రి క‌రీం సాబ్ అదే మండ‌ల ప‌రిధిలోని కొత్త‌కోట గ్రామం స‌రిహ‌ద్దులో స‌ర్వే నెంబ‌ర్ 430/ 1లో 11 ఎక‌రాల 73 సెంట్ల త‌న సొంత భూమిలో వ్య‌వ‌సాయం చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. త‌న భూమికి సంబంధించి మ్యుటేష‌న్ నిమిత్త‌మై స్థానిక ఎమ్మార్వో కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Also Read :  యూర‌ప్ లో గాలికి కొట్టుకుపోతున్న ప్ర‌జ‌లు..వీడియో వైర‌ల్..!

 

ఎమ్మార్వో శివ‌శంక‌ర నాయ‌క్ గ్రామ రాజ‌కీయ‌నాయ‌కుల ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి క‌రీంసాబ్ ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించారు. ఈ త‌రుణంలో క‌రీం సాబ్ త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ న్యాయ‌వాది చ‌ల్లా శివ‌శంక‌ర్ ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ హై కోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ చేప‌ట్టిన హై కోర్టు రైతు భూమిని మ్యుటేష‌న్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎమ్మార్వో ఈ ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోలేదు. కోర్టు ఆదేశాల‌ను పాటించ‌క‌పోవ‌డంతో ఎమ్మార్వోకు హై కోర్టు శిక్ష విధించింది. కోర్టు ధిక్క‌ర‌ణ‌కు సంబంధించి ఈ తీర్పును వెలువ‌రించింది.

Visitors Are Also Reading