Home » యూర‌ప్ లో గాలికి కొట్టుకుపోతున్న ప్ర‌జ‌లు..వీడియో వైర‌ల్..!

యూర‌ప్ లో గాలికి కొట్టుకుపోతున్న ప్ర‌జ‌లు..వీడియో వైర‌ల్..!

by AJAY
Ad

సాధార‌ణంగా తుఫాన్ అంటే ఎక్కువ గాలి వీస్తుంది. ఇండ్ల‌పై రేకులు ఉన్నా లేదంటే రోడ్ల‌పై చెత్త ఉన్నా కొట్టుకుపోతాయి. కానీ మ‌నుషులు గాలికి కొట్టుకుపోవ‌డం ఎప్పుడైనా చూశారా..? జోక్ గా స‌న్న‌గా ఉన్న‌వారిని గాలికి కొట్టుకుపోయేలా ఉన్నావ్ అంటారు కానీ ఇక్క‌డ నిజంగానే గాలికి కొట్టుకుపోతున్నారు. యూర‌ప్ ను యూనిఫ్ తుఫాన్ వ‌ణికిస్తోంది. తుఫాన్ కార‌ణంగా 196 కిలోమీట‌ర్ల వేగంతో అక్క‌డ గాలులు వీస్తున్నాయి. ఆ బ‌ల‌మైన గాలుల‌కు రోడ్ల‌పై నడుస్తున్న‌వారు ఎక్క‌డికో వెళ్లి ప‌డిపోతున్నారు.

Advertisement

Advertisement

అంతే కాకుండా బ‌లంగా వీస్తున్న గాలుల‌కు విమానాలు సైతం ఊగిపోతున్నాయి. ఇళ్ల పైక‌ప్పులు కూడా ఎగిరిపోతున్నాయి. భారీ గాలుల‌తో క‌రెంట్ స్థంబాలు సైతం నేల‌పై ప‌డిపోతున్నాయి. దాంతో క‌రెంట్ లేక కూడా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక ప్ర‌స్తుతం ద‌క్షిణ లండ‌న్ లో ప్ర‌జ‌లు గాలికి కొట్టుకుపోతున్న వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. వీడియోలో గాలికి ఓ వ్య‌క్తి కింద‌ప‌డ్డాడు. దాంతో అక్క‌డ ఉన్న‌వాళ్లు అత‌డిని వ‌చ్చిప‌ట్టుకున్నారు. ఇక మ‌రో వ్య‌క్తి గాలికి ప‌ల్టీలు కొడుతూ రోడ్డు పై ఎక్క‌డికో వెళ్లి ప‌డిపోయాడు.

Visitors Are Also Reading