Home » సూపర్‌ స్టార్‌ కృష్ణ, విజయ నిర్మల ఫ్యామిలీ నుంచి ఎనిమిదో హీరో

సూపర్‌ స్టార్‌ కృష్ణ, విజయ నిర్మల ఫ్యామిలీ నుంచి ఎనిమిదో హీరో

by Bunty
Ad

ఈ మధ్య కాలంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతోంది. అయితే, తాజాగా దివంగత నటులు సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. విజయ నిర్మల మనవడు, నరేష్ అల్లుడు (బావమరిది రాజకుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా వస్తోన్న చిత్రం ‘మిస్టర్ కింగ్’.  2021లో ఈ సినిమాను ప్రకటించారు. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీద ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Advertisement

అయితే, ఈ సినిమా ట్రైలర్ శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ మేరకు హైదరాబాదులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో హీరోయిన్లు, ఇతర చిత్రబృందంతో పాటు సీనియర్ నిర్మాత ఎమ్. ఎస్.రాజు, నటుడు నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ, ‘మిస్టర్ కింగ్ టైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పాటు సైన్స్ ఫిక్షన్ కూడా కనిపిస్తోంది.

Advertisement

ఈ సినిమాతో నా అల్లుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. బహుశా మా కుటుంబం నుంచి ఎనిమిదో హీరో. కృష్ణగారు, విజయనిర్మల గారు సినిమా అనే బీజాన్ని కుటుంబంలో నాటారు. దాని నుంచి ఇంతమంది ఎదిగివచ్చాం. నేను సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. నా ఏడవ ఏటా సినిమాల్లోకి వచ్చాను. మా జీవితమే సినిమా. చరణ్ చాలా కష్టపడ్డాడు. చాలా ఫోకస్ పెట్టి మంచి సినిమాతో రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా శరణ్ కి మంచి భవిష్యత్తు అని నమ్ముతున్నాను’ అని అన్నారు.

READ ALSO : “ఎన్టీఆర్” నుండి “చిరంజీవి” వరకు…మహా శివుడి పాత్రలలో మెప్పించిన టాలీవుడ్ హీరోలు!

Visitors Are Also Reading