Home » రాజీనామాపై స్పందిస్తూ.. ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం…!

రాజీనామాపై స్పందిస్తూ.. ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం…!

by Sravya
Ad

ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఎంపీ పదవితో పాటుగా టిడిపికి రాజీనామా చేస్తానని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు టిడిపి నా అవసరం లేదు అని భావించాక కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన అని ఆయన పోస్ట్ చేయడం జరిగింది. కనుక త్వరలోనే ఢిల్లీ గౌరవా లోక్సభ స్పీకర్ గారిని కలిసి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని అనుకుంటున్నాను అని తర్వాత మరు క్షణం టిడిపికి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. టిడిపిలో గత కొన్ని రోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం మీద తీవ్ర చర్చ నడుస్తోంది.

Advertisement

మొన్న తిరువూరు సభ విషయంలో కూడా కేశినేని బ్రదర్స్ మధ్య మొదలైన పొలిటికల్ వార్ బాగా ముదిరిపోయింది చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు కలిశారని తిరువూరు సభకి సంబంధించిన పార్టీ కార్యక్రమంలో దూరంగా ఉండమని చెప్పారని సోషల్ మీడియా ద్వారా నాని తెలియజేశారు వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు మరొకరికి ఇవ్వబోతున్నట్లు తనతో చర్చించిన విషయాన్ని కూడా చెప్పారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పార్టీ నేతలు ఆయనతో చెప్పారని కూడా వివరించారు. కేశినేని నాని ఈ విషయంపై స్పందిస్తూ అధినేత ఆదేశాలని తప్పకుండా పాటిస్తున్నానని చెప్పారు.

Advertisement

రామభక్త హనుమాన్ చెప్పినట్లే నడుచుకుంటానంటూ నాని చెప్పడం జరిగింది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కచ్చితంగా ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని చెప్పారు ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం కూడా కచ్చితం అని అన్నారు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ఫిబ్రవరిలో ప్రకటిస్తానని అన్నారు. రాజకీయంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఎంపీగా తనకి ఉన్న ప్రోటోకాల్ ప్రకారం వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనన్నారు ఇంతటితో ఆగకుండా చంద్రబాబు హిట్లర్ తో పోలుస్తూ వ్యంగ్యస్త్రాలని సంధించారు. బాస్ ఏం చెప్తే అదే కరెక్ట్ అని చురకలని అంటించారు ఉదాహరణగా జర్మనీ నాశనం అయ్యేదాకా హిట్లర్ కూడా కరెక్టే అని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading