Home » తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలు తమిళంలో మాత్రం అట్టర్ ఫ్లాప్…!

తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలు తమిళంలో మాత్రం అట్టర్ ఫ్లాప్…!

by AJAY
Published: Last Updated on
Ad

కొన్ని చిత్రాలు ఒక భాషలో ప్లాప్ అయినా మరో భాషలో మాత్రం సూపర్ హిట్ గా నిలుస్తాయి. అంటే ప్రాంతాన్ని బట్టి కూడా ప్రేక్షకుల అభిరుచి మారుతుంది. అలా తమిళంలో లో ఫ్లాప్ అయ్యి తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…

Simhadri movie

Simhadri movie

తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన సింహాద్రి సినిమా గజేంద్ర పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. ఈ సినిమాలో హీరోగా విజయ్ కాంత్ నటించారు. కానీ ఈ సినిమా అక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Advertisement

100% Love movie

100% Love movie

నాగచైతన్య హీరోగా నటించిన 100% లవ్ టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో నాగచైతన్య హిట్ అందుకున్నారు కూడా. అయితే ఇదే సినిమాను తమిళంలో జివి ప్రకాష్ కుమార్ హీరోగా 100% కాదల్ గా తెరకెక్కించారు. కానీ అక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Ishq movie

Ishq movie

నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఇష్క్. ఈ సినిమాకు ముందు నితిన్ వరుస ఫ్లాప్ లతో సతమతమైనా కానీ ఇష్క్ సినిమా నితిన్ ను మళ్లీ ఇండస్ట్రీలో నిలబెట్టి సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంలో ఇదే సినిమాను సిద్దు హీరోగా ఉయ్ రే ఉయ్ రే పేరుతో రీమేక్ చేశారు. కానీ అక్కడ ప్లాప్ గా నిలిచింది.

Advertisement

Athanakkode movie

Athanakkode movie

తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అతనొక్కడే సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఇదే సినిమాను తమిళంలో విజయ్ హీరోగా ఆతి పేరుతో తెరకెక్కించగా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

Kick movie

Kick movie

రవితేజ ఇలియానా హీరో హీరోయిన్ లుగా తెరకెక్కిన కిక్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాను తమిళంలో తిల్లా లంగ్డే పేరుతో జయం రవి హీరోగా తెరకెక్కించారు. కానీ అక్కడ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

Lakshyam movie

Lakshyam movie

గోపీచంద్ హీరోగా తెలుగులో లక్ష్యం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇక్కడ సూపర్ హిట్ కాగా తమిళంలో ఇదే సినిమాను అరుణ్ విజయ్ హీరోగా మాంజా వేలు పేరుతో తెరకెక్కించారు. అక్కడ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

also read : శ్రీదేవి వల్ల మెగాస్టార్ కోల్పోయిన సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading