Home » శ్రీదేవి వల్ల మెగాస్టార్ కోల్పోయిన సినిమాలు ఇవే..!

శ్రీదేవి వల్ల మెగాస్టార్ కోల్పోయిన సినిమాలు ఇవే..!

by AJAY
Published: Last Updated on
Ad

బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటి శ్రీదేవి. ఆ తర్వాత శ్రీదేవి హీరోయిన్ గా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను కూడా ఏలింది. ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చింది. అంతేకాకుండా దర్శకులు… నిర్మాతలు సైతం శ్రీదేవి వల్ల ఎంతో దిగారట. కానీ టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి మాత్రం శ్రీదేవి వల్ల నష్టపోయారని మీకు తెలుసా..? చిరంజీవి టాలీవుడ్ లో ఎదుగుతున్న సమయంలో శ్రీదేవి కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఆమె స్క్రీన్ పై కనిపిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అన్న రేంజ్ కు శ్రీదేవి ఎదిగింది. దాంతో నిర్మాతలు శ్రీదేవి ఇంటి ముందు క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో చిరంజీవి శ్రీదేవి తో సినిమా చేయాలని పలువురు దర్శకులు భావించారట. కానీ శ్రీదేవి మాత్రం చిరంజీవితో నటించేందుకు పలు అభ్యంతరాలు చెప్పేదట. కొన్నిసార్లు సినిమా ఒప్పుకొని కూడా ఆ తర్వాత అనేక కారణాలు చెప్పి తప్పకుందట.

Chiranjeevi Sridevi

Chiranjeevi Sridevi

ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మొదట వజ్రాల దొంగ సినిమా కథ రెడీ అయ్యింది. ఈ చిత్రానికి శ్రీదేవినే నిర్మాత కావడం విశేషం. అయితే త్వరలో పట్టాలెక్కుతోంది అనుకున్న సమయంలో శ్రీదేవి ఓ షరతు పెట్టారు. చిత్రానికి తాను నిర్మాత కాబట్టి తన పాత్ర చిరంజీవి కంటే హైలెట్ ఉండాలి అని చెప్పింది. అయితే చిరంజీవి లాంటి స్టార్ ను తగ్గించి చూపించేందుకు దర్శకుడు ఒప్పుకోలేదు. దాంతో ఈ సినిమా ఆగిపోయింది.

Advertisement

Advertisement

చిరంజీవి హీరోగా నటించిన కొండవీటి దొంగ సినిమాలో ముందుగా శ్రీదేవిని అనుకున్నారట. ఈ సినిమాలోనూ తన పాత్ర హైలెట్ గా ఉంటే నటిస్తానని శ్రీదేవి చెప్పిందట. హీరోయిన్ కు ఫైట్లు పెట్టాలని… సినిమా పేరు కొండవీటి రాణి అని మార్చాలని ఆదేశించటం దాంతో ఈ ప్రాజెక్ట్ నుండి శ్రీదేవినే తప్పించి హీరోయిన్లుగా రాధా విజయశాంతి లను ఎంపిక చేశారట.

ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆ తర్వాత శ్రీదేవినే దిగి వచ్చింది. మెగాస్టార్ తో వరుస సినిమాలు చేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలే జగదేక వీరుడు అతిలోక సుందరి, ఎస్పీ పరశురామ్. అలా ఇద్దరి కాంబోలో సినిమాలు రావడం తో అభిమానులు హ్యాపీ గా ఫీల్ అయ్యారు.

also read : జ‌బ‌ర్ద‌స్త్ కు సుడిగాలి సుధీర్ టీమ్ గుడ్ బై…స్టేజ్ పైనే ప్ర‌క‌ట‌న‌..!

Visitors Are Also Reading