Home » చిరు జగదేకవీరుడు అతిలోక సుందరి కి పోటీగా వచ్చి ఘోరంగా ప్లాప్ అయిన సినిమాలు !

చిరు జగదేకవీరుడు అతిలోక సుందరి కి పోటీగా వచ్చి ఘోరంగా ప్లాప్ అయిన సినిమాలు !

by Srilakshmi Bharathi
Ad

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన సినిమా ” జగదేకవీరుడు అతిలోక సుందరి”. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకి ముందే మెగాస్టార్ చిరంజీవి హ్యాట్రిక్ కొట్టారు. ఆ మూడు సినిమాలతో వచ్చిన ఫేమ్ ఒకెత్తు అయితే..” జగదేకవీరుడు అతిలోక సుందరి” సినిమా వచ్చిన ఫేమ్ మరొక ఎత్తు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో పైలోకం నుంచి దిగొచ్చిన ఇంద్ర కుమారిగా శ్రీదేవి నటిస్తే.. ఆమెను బంధించడానికి విలన్ గా అమ్రిత్ పూరి నటించారు. ఆయన నిజంగా తన పాత్రలో జీవించేసి ప్రేక్షకులను భయపెట్టారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి మానవుడిగా నటించి మెప్పించారు. ఈ సినిమా రిలీజ్ తరువాత నిర్మాత అశ్విని దత్ మెగాస్టర్ కు బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయారట. ఇప్పటివరకు ఏ సినిమాకి రాని ప్రాఫిట్ ఈ సినిమాకు వచ్చిందట. ఇక ఇళయరాజా ఇచ్చిన పాటలు వందేళ్లు నిలిచిపోయేలా ఉన్నాయి. కానీ, ఇళయరాజా వీటిని కొన్ని గంటల్లోనే ఫినిష్ చేశారట. అబ్బా తీయని దెబ్బ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన రాజు సుందరం మాస్టర్ అస్వస్థతకి గురి అవడంతో ఆ బాధ్యత ప్రభుదేవా తీసుకుని.. చిరు ప్రశంసలు అందుకున్నాడు. ఆ తరువాత ప్రభుదేవా టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు.

Advertisement

ఆయుధం:

ఈ సినిమా రికార్డ్స్ కి అంతం లేదు అన్నట్లుగా ప్రభంజనం కొనసాగింది. అయితే.. ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ధాటికి మిగతా సినిమాల కలెక్షన్స్ గల్లంతయ్యాయి. ఆ సినిమాల్లో ఒకటి సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సోదరుడు రమేష్ బాబు కలిసి నటించిన “ఆయుధం” సినిమా. తనకి జరిగిన అన్యాయంపై ఓ ఆడపిల్ల పోరాటం చేయడం అనే ఇతివృత్తం చుట్టూ కథ తిరుగుతుంది. ఆ సినిమా ఇంటరెస్టింగ్ గా సాగింది. కానీ జనాదరణ పొందలేదు.

Advertisement

నారి నారి నడుమ మురారి:


బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా పక్కా ఫామిలీ సినిమా. ఫామిలీ ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది.కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు. మూడు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది సినిమా.

మామ అల్లుడు:


జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ కి తొమ్మిది రోజుల ముందుగా రాజేంద్ర ప్రసాద్ మామ అల్లుడు సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో దాసరి కూడా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకున్నా.. కలెక్షన్స్ విషయంలో యావరేజ్ గా నిలిచింది.

జస్టిస్ రుద్రమదేవి:


సీనియర్ నరేష్ హీరోగా, జయప్రద జడ్జి గా నటించిన సినిమా జస్టిస్ రుద్రమదేవి. ప్రేమ పేరుతొ మోసం చేసాడు అంటూ హీరోయిన్ కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఆ తరువాత కథ ఎలాంటి ట్విస్ట్ తిరుగుతుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకూడా అంతగా జనాదరణ పొందలేదు.

శిలాశాసనం:
యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా నటించిన శిలాశాసనం సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి కి తొమ్మిది రోజుల గ్యాప్ తో రిలీజ్ అయ్యింది. మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఈ అన్నిటిలో బాలయ్య బాబు నారి నారి నడుమ మురారి సినిమా మాత్రమే కాస్త నిలబడింది అని చెప్పవచ్చు.

Visitors Are Also Reading