Home » సిద్ శ్రీరామ్ కు బంపరాఫర్…ఆ స్టార్ దర్శకుడి సినిమాలో హీరోగా ఛాన్స్…!

సిద్ శ్రీరామ్ కు బంపరాఫర్…ఆ స్టార్ దర్శకుడి సినిమాలో హీరోగా ఛాన్స్…!

by AJAY
Ad

ప్రస్తుతం సినిమాల్లో నటించే హీరోలకు మాత్రమే కాకుండా కొరియోగ్రాఫర్లు, సింగర్స్ కూడా ఎంతో పాపులర్ అవుతున్నారు. ఇక ఇటీవల కాలంలో తన పాటలతో ఎంతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గాయకుడు సిద్ శ్రీ రామ్. ప్రస్తుతం ఈ యువ సింగర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిద్ శ్రీరామ్ పాడిన ప్రతీ పాటకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా సినిమా విడుదలకు ముందే సదరు సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ కూడా వచ్చేస్తోంది.

Sid sriram

Sid sriram

దాంతో సిద్ శ్రీరామ్ ఇప్పుడు ఒక్కో పాటకు రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. సిద్ శ్రీరామ్ పాటలే కాకుండా అతని అందానికి కూడా ఎంతో మంది అమ్మాయిలు ఫిదా అయ్యారు. అయితే అలాంటి అభిమానుల కు ఇప్పుడు చెప్పబోయే వార్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సిద్ శ్రీరామ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు హీరోగా రాబోతున్నాడు.

Advertisement

Advertisement

Sid sriram

Sid sriram

సిద్ శ్రీరామ్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలోనే సిద్ శ్రీరామ్ సినిమా చేయబోతున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సిద్ శ్రీరామ్… మణిరత్నం చెప్పిన స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇక అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది అని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కనుక పట్టాలెక్కితే ఇంతకాలం సింగర్ గా అలరించిన శ్రీ రామ్ హీరోగా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

Also read : స్టుప్పిడ్స్ అంటూ నెటిజన్ పై ఫైర్ అయిన హరీష్ శంకర్…కారణం ఇదే…!

Visitors Are Also Reading