Home » స్టుప్పిడ్స్ అంటూ నెటిజన్ పై ఫైర్ అయిన హరీష్ శంకర్…కారణం ఇదే…!

స్టుప్పిడ్స్ అంటూ నెటిజన్ పై ఫైర్ అయిన హరీష్ శంకర్…కారణం ఇదే…!

by AJAY

షాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు హరీష్ శంకర్. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ వరుస ఆఫర్లు అందుకున్నారు. కానీ గబ్బర్ సింగ్ సినిమాతో హరీష్ శంకర్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన దబాంగ్ సినిమాను హరీష్ శంకర్ “గబ్బర్ సింగ్” పేరుతో రీమేక్ చేశారు. అప్పటివరకు తెలుగులో రీమేక్ లు పెద్దగా విజయం సాధించింది లేదు. కానీ హరీష్ శంకర్ మాత్రం గబ్బర్ సింగ్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఇక చివరిగా హరీష్ శంకర్ మెగా హీరో వరుణ్ తేజ్ తో “గద్దల కొండ గణేష్” చిత్రాన్ని తెరకెక్కించాడు.

Harish Shanker

Harish Shanker

ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం మళ్ళీ పవన్ కళ్యాణ్ తో హరీశ్ శంకర్ సినిమా చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే సినిమాలతో పాటు హరీష్ శంకర్ రాజకీయ, సామాజిక అంశాలపై కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. అంతేకాకుండా తనకు నెటిజన్లు పెట్టే కామెంట్లపై సైతం అప్పుడప్పుడు ఘాటుగా స్పందిస్తుంటారు. తాజాగా హరీష్ శంకర్ ఓ నెటిజన్ పై ఫైర్ అయ్యారు. హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఓ ప్రముఖ వైద్య నిపుణుడు ఒమిక్రాన్ వ్యాప్తి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పిన వీడియోను షేర్ చేశాడు.

Also read : టాలీవుడ్ లో కొడుకులను కోల్పోయి బాధపడుతున్న ప్రముఖులు వీళ్ళే..!

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హరీష్ శంకర్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ వీడియోకు ఓ నెటిజన్ హరీష్ శంకర్ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని… తీవ్ర ఆందోళన తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్ చేశారు. దాంతో వెంటనే హరీష్ శంకర్ స్పందించారు. “మీలాంటి మూర్ఖులు నిరుత్సాహానికి గురవుతున్నారని సంతోషిస్తున్నాను… ఎందుకంటే మీలాంటివారు ఎప్పుడూ ఒక నిపుణుడు ఏదైనా మంచి చెప్పినప్పుడు, అతను పదే పదే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినప్పుడు ప్రజలకు ఆశలు కల్పించాలని కోరుకోరు” అంటూ ఘాటుగా స్పందించారు.

Visitors Are Also Reading