Home » వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు నా పేరు వాడుకోవద్దు అంటూ

వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు నా పేరు వాడుకోవద్దు అంటూ

by Anji
Published: Last Updated on
Ad

సినీ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  తాజాగా ఈయన ట్విట్టర్ లో ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. రాజకీయంగా తన పేరును ఉపయోగించుకుంటున్నారని.. అలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ప్రముఖ సినీనటుడు మంచు మోహన్ బాబు. తన పేరును అనవసరంగా వాడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Advertisement

ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారవి. అది వారి వ్యక్తిగతం అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. చేతనైతే నలుగురికి సాయపడటంలోనే మనం దృష్టి పెట్టాలిగానీ.. సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ.. శాంతి సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించినవారిపై న్యాయపరమైన చర్యలు తాసుకుంటానని హెచ్చరిస్తూ.. ధన్యవాదాలతో మీ మోహన్ బాబు అని ఆ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు ఆ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

మోహన్ బాబు పేరును ఎవరు వాడుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన పేరును వాడుకుని రాజకీయాలు చేసేంత అవసరం ఎవరికుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్న సమయంలో మోహన్ బాబు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Also Read : చిరంజీవి న‌టించిన సినిమాల్లో బాల‌య్య‌కు చాలా ఇష్ట‌మైన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..?

Visitors Are Also Reading