Home » ఆక‌ట్టుకుంటున్న మ‌హేష్‌బాబు కొత్త యాడ్

ఆక‌ట్టుకుంటున్న మ‌హేష్‌బాబు కొత్త యాడ్

by Anji
Ad

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు సినిమాల‌తో పాటు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో కూడా బిజీగా గ‌డుపుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు బ్రాండ్‌ల‌కు మ‌హేష్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిన‌దే. గ‌తంలో థ‌మ్స‌ప్ యాడ్‌లో న‌టించిన మ‌హేష్ ఇప్పుడు మ‌రొక కూల్ డ్రింక్ యాడ్ లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. మ‌హేష్‌బాబు తాజాగా మ‌రొక బ్రాండ్‌కు ప్ర‌చార కార్య‌క‌ర్త‌గా మారారు. అదే మౌంటెన్ డ్యూ. దీనికి సంబంధించిన వీడియోల‌ను ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్‌లో ఖాతాలో మ‌హేష్‌ పోస్ట్ చేసాడు.

Advertisement

ఈ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌ను ఇటీవ‌లే షూట్ చేసి ఫిబ్ర‌వ‌రి 04న విడుద‌ల చేసారు. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దుబాయ్‌లోని అత్యంత పాపుల‌ర్ అయిన బూర్జు ఖ‌లీఫాపై ఈ యాడ్‌ను షూట్ చేశారు. ముఖ్యంగా బూర్జు ఖలీఫా పై నుంచి కింది వ‌ర‌కు బైకు పై వ‌చ్చిన‌ట్టు ఈ యాడ్ ఉంది. హాలీవుడ్ రేంజ్‌లో దీనిని రూపొందించారు.

Advertisement

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి పెళ్లి సంబంధం కుదురుతుంది

భ‌యానికి భ‌య‌ప‌డితే ఏ సాహసం చేయ‌లేం అని, మ‌హేష్ సందేశం ఇచ్చాడు. ఇప్పుడు ఈ యాడ్ మ‌హేష్ అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. మ‌హేష్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారువారిపాట చేస్తున్నాడు. ఈ చిత్రంలో మ‌రింత స్టైలిష్‌గా క‌నిపించ‌నున్నారు మ‌హేష్‌. ఇప్ప‌టికే విడుద‌ల అయిన ఈ సినిమా ట్రైల‌ర్ అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది స‌ర్కారు వారి పాట‌.

https://twitter.com/urstrulyMahesh/status/1489471615767576581?s=20&t=sdoAF0PbxQpRdtKKe1caYw

Visitors Are Also Reading