Telugu News » Blog » దోమలకు అలాంటి వారి రక్తం అంటే చాలా ఇష్టమట.. సైంటిస్టులు ఏమంటున్నారంటే..?

దోమలకు అలాంటి వారి రక్తం అంటే చాలా ఇష్టమట.. సైంటిస్టులు ఏమంటున్నారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

వేసవికాలం వచ్చిందంటే చాలు ఇక దోమలు వాటీ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే కొంతమందిని మాత్రమే ఎక్కువగా కుడతాయని అంటుంటారు. దోమల తమ చుట్టూ ఎక్కువగా తిరుగుతుంటాయని వారు చెబుతూ ఉంటారు. అయితే దోమలు కొందరిని మాత్రమే ఎక్కువగా కుడతాయని చెప్పడంలో నిజం ఉందా.. లేదంటే ఉట్టి భ్రమ అనే విషయంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.

Advertisement

also read:వంటల్లో ఈ 5 మసాలాలు వాడితే మీ ఒంట్లో కొవ్వును కరిగించినట్టే..!

నిజానికి దోమలను ఆకర్షించేలా కొందరి శరీరం ఒక ప్రత్యేకమైనటువంటి వాసన వస్తుందట. అయితే ఈ యొక్క అధ్యయనం అనేక పాత నమ్మకాలను తిరగేసింది. రక్తంలో చెక్కర పరిమాణం ఎక్కువగా ఉన్న, అరటి పండ్లు, వెల్లుల్లి తిన్నా కానీ అలాంటి వారిని దోమలు ఎక్కువగా కుడతాయట. ఇవి తీసుకునే వారి శరీరంలో కార్బాక్సిలిన్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉన్న వ్యక్తులకు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మానవ చర్మం దోమలను ఆకర్షించడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.

Advertisement

also read:ఆ వాసన ఆ హీరోయిన్ నుంచి మాత్రమే వచ్చేదట.. కారణమేంటంటే..?

అయితే ఈ అధ్యయనంలో చాలామంది నైలాన్ దుస్తులు ధరించి వారిపై అధ్యయనం చేయించారు. ఇటువంటి దుస్తులు ధరించిన వారిలో దోమలను ఆకర్షించే కార్బాక్సిలిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తు చేశారు. ఇందులో ప్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉన్న వారి వైపు దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయని వారన్నారు.

Advertisement

also read:మహేష్ బాబు ఆ మూవీలో డైలాగ్ చెప్పడానికి 2గంటలు పట్టిందట.. ఎందుకంటే..?