Home » మహేష్ బాబు ఆ మూవీలో డైలాగ్ చెప్పడానికి 2గంటలు పట్టిందట.. ఎందుకంటే..?

మహేష్ బాబు ఆ మూవీలో డైలాగ్ చెప్పడానికి 2గంటలు పట్టిందట.. ఎందుకంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ లోనే ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించారు. నటన విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆయన ఎన్నో విభిన్నమైన చిత్రాలు నటించి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లోనే నటిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆ మూవీలు ప్రజాధరణ పొందుతూ సక్సెస్ అవుతున్నాయి. ఇక అలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో భరత్ అనే నేను కూడా ఒకటి. ఇందులో మహేష్ బాబు సీఎంగా నటించారు.

also read:రాత్రిపూట మీరు చపాతీలు తింటున్నారా ? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

Advertisement

ఇంకా ఈ చిత్రంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని మహేష్ బాబు మొదలు పెడతాడు. అయితే దాన్నే సినిమా టైటిల్ గా పెట్టేసారు. అయితే సినిమా రిలీజ్ కి ముందే ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చేందుకు ఈ డైలాగ్ కూడా కారణం కావచ్చు. ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్షన్ చేయగా, సామాజిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన మూవీ కావడంతో ఈ మూవీని ఆదరించారు. అయితే ఇందులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మహేష్ బాబు చేసే ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది.

Advertisement

also read:Dasara : “దసరా” ట్రైలర్ విడుదల.. గత్తర్ లేపిన నాని

భరత్ అనే నేను అంటూ మొదలయ్యే ఈ ప్రమాణం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ ఒక్క డైలాగు చెప్పడానికి మహేష్ బాబు తీసుకున్న టైం రెండు గంటలకు పైగానే. ఎందుకంత టైం తీసుకున్నారు ఆ డైలాగ్ డబ్బింగ్ చెప్పిన తర్వాత మహేష్ ఎలా ఫీలయ్యారు అంటే సాధారణంగా నేతలు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తప్పులు దొర్లుతూ ఉంటాయి. ఈ మూవీ కనక ఇలాంటి తప్పు లేకుండా ఒక బేస్ వాయిస్ తో రావాలి. అందుకనే చాలా టైం తీసుకుని ఆ డైలాగులు చెప్పానని ఆ తర్వాత గొప్పగా ఫీల్ అయ్యానని మహేష్ అప్పట్లో ఇంటర్వ్యూలో తెలియజేశారు.

also read:

Visitors Are Also Reading