ఆచార్య చానిక్యుడు మన జీవితంలో జరిగేటువంటి ప్రస్తుత పరిణామాల గురించి తన నీతిలో ఎప్పుడో తెలియజేశారు.. మనిషి జీవితంలో ఏ విధమైన పరిస్థితులు అనుభవిస్తారు.ఏ విధంగా ఉంటే ఎలా జీవితం అనేది ఆయన ముందుగానే ఊహించి తెలియజేశారు. ఆయన చెప్పిన కొన్ని సూత్రాలను మనం ఇప్పుడు చూద్దాం..! ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని.. డబ్బు కష్టపడి సంపాదిస్తే గాని దాని విలువ ఏంటనేది మనకు అర్థం కాదు. కానీ కొందరు దాని విలువ అసలు గుర్తించారు.
Advertisement
వచ్చిన రూపాయిని వచ్చినట్టే ఖర్చు చేస్తారు. ఇలాంటి వారు డబ్బుతో అనేక ఇబ్బందులు పడతారు. అప్పులు చేసి వారి జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. చివరికి అంతా అయిపోయిందని భావించి చేతులెత్తేస్తారు. ఇలా చాలా మంది వారి జీవితాలను గడుపుతూ ఉంటారు. అయితే చాణిక్యుడు చెప్పిన నీతి ప్రకారం చూస్తే కొంతమంది దగ్గర డబ్బు అనేది అస్సలు నిలబడదట. ఎన్ని డబ్బులు వచ్చిన ఖర్చు అయిపోతాయట.. వారెవరో చూద్దాం..!
Advertisement
చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం పగటిపూట నిద్ర పోయే వారికి జీవితకాలం డబ్బు లోటు ఉంటుంది.. వారి దగ్గర అసలు డబ్బు నిలవడం కష్టమని చాణిక్యుడు అంటున్నారు.
ఎప్పుడూ చెడ్డ మాటలు మాట్లాడుతూ చెడు పనులు చేసేవారి దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదని చాణిక్యుడు తన నీతీ ద్వారా తెలియజేశారు.