గిరిజనులు ఎక్కువగా అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవిస్తుంటారు.. అక్కడ పండించే పంటలకు ఆర్గానిక్ అనే పేరు ఉండటంతో మార్కెట్లో కూడా మంచి డిమాండ్ వస్తుంది. అయితే చింతపండు విషయంలో విశాఖపట్నం లోని ఏజెన్సీలో ఉన్న గిరిజనులకు మరింత ఆందోళన కలిగిస్తోంది. సోమవారం రోజున చింతపండు అమ్మాలంటే వారు భయపడి పోతున్నారు. ఎందుకంటే ఆరోజు చింతపండు ధర చాలా తగ్గిపోతుంది. మిగతా రోజుల్లో మాత్రం ధర అటుఇటుగా ఉన్నా సోమవారం రోజు వస్తే వివిధ కారణాలతో చింతపండు ధర తగ్గిపోతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి
Advertisement
కారణాలు కూడా చెబుతున్నారు.. గిరిజనుల దగ్గర వార సంతలు వారంలో రెండు సార్లు జరుగుతాయి. సోమవారం మరియు గురువారం.. కానీ గిరి పుత్రులకు సోమవారం రోజున చింతపండు అమ్మకాలు అసలు కలిసి రాదట. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనీ అంటున్నారు. సాధారణంగా చింతపండు మార్కెట్ విలువ పిక్క తీసింది అయితే 120 రూపాయలు కిలో.. పిక్క తీయనిది అయితే 80 రూపాయలకు కిలో. కానీ గిరిజనులు మాత్రం పిక్కతో ఉన్న దాన్ని కేజీ
Advertisement
40 మాత్రమే అమ్ముతున్నారు. అయితే చింతపండును గిరిజనుల నుంచి దళారులు కొనేసి ట్రాన్స్పోర్ట్ ప్యూరిఫైయర్ అనే పేరుతో రకరకాల ధరలు వేసి వినియోగదారుడికి వదిలేస్తున్నారు. దీంతో ధర బయటి మార్కెట్ కి వచ్చేసరికి డబల్ అయిపోతుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో గిరిపుత్రులు పండించిన చింతపండు మాత్రం అంత ధర రాదు. ఇందులోనూ సోమవారం చాలా సెంటిమెంట్ గా భావిస్తారు. గురువారం రోజున అమ్ముకుంటే వచ్చే లాభం సోమవారం రాదని అనుకుంటారు గిరి పుత్రుడు. అందుకే వారికి సోమవారం అంటే అంత భయం.
ALSO READ:
తెలంగాణ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఫ్యాక్టరీ..!
నెట్టింట వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లి పత్రిక…ఎన్టీఆర్ ఎంత కట్నం ఇచ్చారంటే..!