తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు అంటే తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సాధించాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ మెల్లిగా హీరోగా మంచి క్రేజీ సంపాదించుకున్నాడు.. ఆయన ఇండస్ట్రీలో తండ్రిగా, విలన్ గా కమెడియన్ గా చేయని పాత్ర అంటూ లేదు. అలాంటి మోహన్ బాబు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ లు అందుకొని, కలెక్షన్ కింగ్ గా మారారు. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన మోహన్ బాబు విలక్షణ నటుడిగా పేరు పొందారు. అలాంటి ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమా కెరియర్ గురించి అనేక విషయాలు బయట పెట్టారు..
also read:ఉగాది నుంచి గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి విజయం పక్కా..!
Advertisement
కెరియర్ పరంగా చూసుకుంటే నాకు ఎవరు ఎలాంటి సాయం చేయలేదు. కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ప్రకృతి మాత్రమే నాకు సాయం అందించింది. సినిమాలు చేసే నేను సంపాదించగలిగాను. అంతేకాదు కొన్ని సినిమాలు తీయడం వల్ల నష్టం వచ్చింది కొన్ని ఆస్తులు కూడా అమ్ముకున్నాను. దీనికి ప్రధాన కారణం నేను మళ్ళీ సంపాదించగలుగుతానని ధైర్యంతో ముందుకు వెళ్లాను. నష్టం వచ్చిన వెనుకడుగు వేయకుండా ఉన్నాను. నాకంటే సీనియర్ హీరోలు సొంత బ్యానర్లు పెట్టడం చూసి నేను కూడా సొంత బ్యానర్ పెట్టాను. ఇందులో ఏ హీరో ని కూడా స్ఫూర్తిగా తీసుకోలేదు. నేను ఈ బ్యానర్ పెట్టడం అప్పట్లో దాసరి గారికి ఇష్టం ఉండేది కాదు.
Advertisement
also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి
దీనికి ప్రధాన కారణం వీడు డబ్బులు ఎక్కడ పోగొట్టుకుంటాడో అనే భయం ఆయనకు ఉండేది అని చెప్పారు. అప్పట్లో నా బ్యానర్లో తీసిన ఏ సినిమా అయినా సూపర్ హిట్ అయ్యేది. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు ఫ్లాపులవుతున్నాయి. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని ఈ విషయంలో ప్రేక్షకులను తప్పు పట్టడానికి లేదని అన్నారు. సన్నాఫ్ ఇండియా సినిమా ఒక ప్రయోగమని చెప్పాను. అందువల్ల ఆ సినిమా పోయినా నాకు పెద్ద బాధ అనిపించలేదు. కానీ జిన్నా మూవీ ఎందుకు ఫెయిల్ అయిందనేది అర్థం కాలేదు అంటూ తన మనసులో ఉన్న మాటను బయటపెట్టేశారు మోహన్ బాబు.
also read:నిజాలేంటో ఎవ్వరికీ తెలియదు..చిరుతో గొడవపై మోహన్ బాబు సెన్సెషనల్ కామెంట్స్..!