తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు వారి ఫ్యామిలీ కి ఎంతటి గౌరవ మర్యాదలు ఉంటాయో మనందరికీ తెలుసు. ఇంతటి గౌరవ మర్యాదలు ఉండడానికి కారణం మంచు మోహన్ బాబు కష్టమని చెప్పవచ్చు. ఆయన ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. ఎంతో పేరు సంపాదించారు. ఆయన వారసునిగా మంచు మనోజ్, మంచు విష్ణు హీరోలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ స్టార్ హీరోలుగా ఎదగలేకపోయారు. ఈ మధ్యకాలంలో మంచు మనోజ్ తాను ప్రేమించిన భూమా మౌనిక ను పెళ్లి చేసుకొని చరిత్ర సృష్టించారు.
Advertisement
Also Read:ఆది పురుష్ నుంచి క్రేజీ అప్డేట్…. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జైశ్రీరామ్ సాంగ్..!!
వీరి ప్రేమ వివాహం గురించి అనేక వార్తలు సంచలనంగా మారాయి . వీరి వివాహం మోహన్ బాబు కి ఇష్టం లేదని అప్పట్లో అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఏది ఏమైనా చివరికి వీరిద్దరు వివాహం ద్వారా ఒక్కటయ్యారు. ఈ వివాహానికి మోహన్ బాబు రాడు అని అందరూ భావించారు. కానీ ఆయన సతీసమేతంగా వచ్చి కొడుకును కోడల్ని ఆశీర్వదించి , కోడల్ని ముద్దాడి ఈ పుకార్లకు చెక్ పెట్టాడు. అయితే ఒక సందర్భంలో మౌనిక తన మామ మోహన్ బాబు గురించి పలు విషయాలు చెప్పుకొచ్చింది..
Advertisement
Also Read:నేను అక్కినేని వారసుడినే కాదు : అఖిల్ సంచలన వ్యాఖ్యలు
అలాంటి అత్తమామలు దొరకడం నా అదృష్టమని, మోహన్ బాబు గారు తన కొడుకును కూడా సొంత మనవడిలాగే చూసుకుంటారని తెలియజేసింది. మామయ్య నాతో చాలా సరదాగా ఉంటారని, పెళ్లి కాక ముందు కూడా నేను వారి ఇంటికి వెళ్తే నాకు స్వయంగా ఆయన అన్నం తినిపించారంటూ ఎమోషనల్ అయింది. అత్తయ్య ఎప్పుడు నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుందని, నాకు చాలా సపోర్ట్ గా ఉంటుందని తెలియజేసింది. అత్తయ్య మామయ్య నాకు దేవుడిచ్చిన వరం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మౌనిక మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read:నాకు అదే చివరి మ్యాచ్… రిటైర్మెంట్ పై ధోని సంచలన ప్రకటన