Home » మ‌హేశ్ బాబు సినిమాలో మోహ‌న్ బాబు..రోల్ ఏంటంటే..!

మ‌హేశ్ బాబు సినిమాలో మోహ‌న్ బాబు..రోల్ ఏంటంటే..!

by AJAY
Ad

మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట‌ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త‌ర‌వాత మ‌హేశ్ బాబు త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ సినిమా చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. నిజానికి మహేశ్ బాబు కొరటాల శివ‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యి త్రివిక్ర‌మ్ ఓ క‌న్ఫామ్ అయ్యింది.

mahesh babu mohan babu

mahesh babu mohan babu

ఇక ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ మ‌హేశ్ బాబు కాంబినేష‌న్ లో అత‌డు, ఖ‌లేజా సినిమాలు వ‌చ్చాయి. ఈ రెండు సినిమాల‌కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది కానీ ఏ సినిమా కూడా బ్లాక్ బ‌స్టర్ గా నిల‌వ‌లేక‌పోయింది. ఇక మ‌హేశ్ బాబు ముచ్చ‌ట‌గా మూడో అవ‌కాశం ఇవ్వ‌డంతో త్రివిక్ర‌మ్ ఈ సారి హిట్టు కొట్టాల‌నే సంక‌ల్పంతో ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్ట‌బొమ్మ పూజ హెగ్డే ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. అంతే కాకుండా ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ గా సంయుక్త మీన‌న్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

Advertisement

అయితే తాజాగా ఈ సినిమాపై మ‌రో ఇంట్రెస్టింగ్ వార్త వైర‌ల్ అవుతోంది. ఈ సినిమాలో మోహ‌న్ బాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్టున్న‌ట్టు తెలుస్తోంది. మ‌హేశ్ బాబుకు మ‌వ‌య్య‌గా ఈ సినిమాలో మోహ‌న్ బాబు న‌టించ‌బోతున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది.. అంతా అనుకున్న‌ట్టుగా జ‌రిగితే ఈ సినిమాలో మోహ‌న్ బాబు న‌టించే అవ‌కాశం ఉన్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading