Home » 15 కోట్ల‌తో మోడీకి కొత్త కార్! ఈ కార్ విశేషాలేంటో తెలుసుకుందాం!

15 కోట్ల‌తో మోడీకి కొత్త కార్! ఈ కార్ విశేషాలేంటో తెలుసుకుందాం!

by Azhar
Ad

మోడీ కాన్వాయ్ లోకి 15 కోట్ల విలువ చేసే మెర్సిడెజ్ మేబ్యాక్ S650 కార్ వ‌చ్చి చేరింది. ప్ర‌ధానిగా భాద్య‌త‌లు చేప‌ట్టిన మొద‌ట్లో మోడీ మహీంద్రా స్కార్పియో బుల్లెట్ ప్రూఫ్ కార్ ను వాడారు. ఆ త‌ర్వాత BMW 7 సిరీస్ హై-సెక్యూరిటీ ఎడిషన్, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ వోగ్, ల్యాండ్ క్రూయిజర్ లాంటి అనేక కార్లను వాడారు.

Advertisement

ఈ కార్ విశేషాలు :

Advertisement

  • దీని ఖ‌రీదు దాదాపు 15 కోట్లు
  • దీని బాడీ బుల్లెట్ల‌ను అడ్డుకోగ‌ల‌దు.
  • ఈ కార్ రెండు మీటర్ల దూరంలో 15 కిలోల TNT పేలినా త‌ట్టుకోగ‌ల‌దు.
  • కార్ దిగువ భాగం ప‌క‌డ్బందీగా ఉంటుంది.
  • గ్యాస్ దాడి జరిగినప్పుడు ఈ కార్ క్యాబిన్ క్లోజ్ అయ్యి లోప‌ల ప్ర‌త్యేక గాలిని అందిస్తుంది
  • దీని గ‌రిష్ట వేగం 190 kmph
  • ఈ కార్ టైర్లు డ్యామేజ్ లేదా పంక్చర్ అయినా దాదాపు 30 కి.మీ వరకు న‌డ‌వ‌గ‌ల‌వు.

మోడీకి కొత్త కార్ కావాలన్న ప్ర‌తిపాద‌న‌ను ఆయ‌న‌కు భద్ర‌త‌నిస్తున్న SPG తీసుకుంది. అందుకే అత్యాధునిక సౌక‌ర్యాలతో పాటు భ‌ద్ర‌తాప‌రంగా క‌ట్టుదిట్టంగా ఉన్న ఈ మెర్సిడెజ్ మేబ్యాక్ ను తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. మోడీ కాన్వాయ్ లో ఇలాంటి రెండు కార్లు ఉంటాయి. అందులో ఒక‌టి డమ్మీగా ఉంటుంది.

Visitors Are Also Reading