Home » MM Keeravani : ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం

MM Keeravani : ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం

by Bunty
Ad

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటి వరకు చాలామంది ప్రముఖ దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది స్వర్గానికి చేరుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా కొంతమంది మరణిస్తే, మరి కొంత మంది వ్యక్తిగత కారణాలవల్ల స్వర్గస్తులు అయ్యారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట విషాదం చోటు చేసుకుంది.

Advertisement

ఎంఎం కీరవాణి తల్లి భానుమతి బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న భానుమతిని కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్యం క్షమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. భానుమతి భౌతిక కాయాన్ని మరికాసేపట్లో ఎస్ఎస్ రాజమౌళి నివాసానికి తీసుకెళ్లనున్నారు. తల్లి మృతితో కీరవాణి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

మాతృమూర్తి మరణంతో తీవ్ర శోకంలో ఉన్న ఎంఎం కీరవాణి కుటుంబ సభ్యులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, ఇటీవలే RRR కి సంగీతం అందించిన ఎంఎం కీరవాణి, ‘బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’ గా అంతర్జాతీయ అవార్డుని అందుకున్నాడు. లాస్ట్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రకటించే ఈ అవార్డ్స్ లో, 2022 కు గాను ఎంఎం కీరవాణి విన్నర్ గా నిలిచాడు. ఈ విషయాన్ని లాస్ ఏంజెల్స్ అసోసియేషన్ తమ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

READ ALSO : అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా వసూలు కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి !

Visitors Are Also Reading